Friday, May 24, 2024
- Advertisement -

స్టార్ హీరో కూతురు.. గంటకు మరీ అంత డిమాండ్ చేసేస్తోంది!

- Advertisement -

బాలీవుడ్ గన్ షాట్ శత్రుఘ్నసిన్హా కూతురుగా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన  హీరోయిన్ సోనాక్షి సిన్హా. దబాంగ్ సినిమాతో ఒక రేంజ్ కు చేరిపోయి.. ఆ తర్వాత కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సోనాక్షి ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కొత్త హైట్స్ కు చేరుతోంది.

కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. స్టేజి షోలతోనూ.. ఇతర కార్యక్రమాలతోనూ బిజీగా ఉండే సోనాక్షి ఆ విషయంలో పారితోషకాన్ని చుక్కల స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు సోనాక్షితో ఒక స్టేజ్ షోను ఏర్పాటు చేయాలంటే గంటకు పదిలక్షల రూపాయలట! ప్రైవేట్ ఫంక్షన్లలో అయినా.. సినిమా ఫంక్షన్లలో అయినా డాన్సులు చేసే సోనాక్షి ఆ కార్యక్రమాల్లో గంటసేపు గడపడానికి పదిలక్షల రూపాయల సొమ్మును డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ స్థాయి పారితోషకం తోపాటు ఆమె రానుపోను విమాన ఖర్చులు ఇతరాలు కూడా ఆ కార్యక్రమ నిర్వాహకులే భరించాలని తెలుస్తోంది. మరి ఇంత స్థాయిలో డిమాండ్ చేస్తున్నా సోనాక్షి కోసం అయితే కార్యక్రమాల నిర్వాహకులు పోటీలు పడుతున్నారు. ఆమె అంత అడుగుతున్నా ఇచ్చి మరీ ఆమెను తమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. మరి అదీ సోనాక్షి స్థాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -