Saturday, May 10, 2025
- Advertisement -

జగన్‌ దీక్ష భగ్నం…

- Advertisement -

ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన దీక్ష భగ్నమైంది. తెల్లవారుజామున 4గంటలకు జగన్‌ నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ప్రత్యేక అంబులెన్స్‌లో జగన్‌ను జీజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసేటప్పుడు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్ద గుమిగూడారు. దీక్షను విరమించేది లేదని జగన్ వారించినా..పోలీసులు బలవంతంగా జగన్ దీక్షను భగ్నం చేశారు.

దీక్ష 7వ రోజుకు చేరుకోవడంతో జగన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. బీపీ, షుగర్‌ లెవల్స్‌ బాగా పడిపోవడంతో..జగన్‌ బాగా నీరసించిపోయారు. దీంతో ఎలాగైనా జగన్‌ను ఆసుపత్రికి తరలించాలన్న ఉద్దేశ్యంతో దీక్షను పోలీసులు భగ్నం చేసి..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -