ఒకవైపు రుద్రమదేవి సినిమా గత వారంలో విడుదల అయ్యి.. ఇప్పుడిప్పుడు పాజిటివ్ టాక్ తో.. వసూళ్లను సాధించుకుంటున్న నేపథ్యంలో ఇంతలోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా “బ్రూస్ లీ” విడుదలకు సిద్ధం అవుతుండటాన్ని పరోక్షంగా తప్పుపట్టాడు దాసరి నారాయణ రావు.
ఇప్పుడు ఆ సినిమా విడుదల అయితే.. రుద్రమదేవిపై ప్రభావం పడుతుందని.. ఆ సినిమాకు వసూళ్లు తగ్గిపోతాయని.. ఇది ఎవరి కోసం అని దాసరి ప్రశ్నించాడు. ఎవరు ఎవరిని దెబ్బతీయడానికి ఇలా వ్యవహరిస్తున్నారని దాసరి నారాయణ రావు ప్రశ్నించారు. మరి దాసరి మిగతా ఎవరి మీద అయినా ఇలా మాట్లాడి ఉంటే అది అంత పెద్ద విశేషం అయ్యేది కాదు. కానీ ఆయన ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విషయంలో మాట్లాడాడు.
బ్రూస్ లీ వచ్చి చక్కటి చిత్రం రుద్రమదేవిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని పరోక్షంగా విమర్శించాడు. మరి దాసరి అలా రెచ్చిపోయాడో లేదో.. ఇవతల నుంచి గట్టి సమాధానం వచ్చింది. ఈ సారి అల్లు ఆర్జున్ స్పందించాడు. రుద్రమదేవి సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చిందని.. వివిధ వాయిదాలతో ఆ సినిమా ఇప్పుడు విడుదల అయ్యిందని.. ఈ సినిమా కూ బ్రూస్ లీకి ఎలాంటి సంబంధం లేదని.. బ్రూస్ లీ విడుదల ఎప్పుడో ఫిక్సయినడేట్ అని.. ఆ సినిమాను నిందించవద్దని అల్లు అర్జున్ అంటున్నాడు.
ఈ విధంగా మెగా ఫ్యామిలీ దాసరికి కౌంటరిచ్చింది. అనవసరమైన వివాదాలు చేయవద్దని.. స్పష్టం చేసింది. మరి దీనిపై దాసరి ఇప్పుడేమనుకొంటున్నారో!
బ్రూస్ లీని టార్గెట్ చేసిన దాసరి
అనుకున్నదే జరిగింది.దాసరి నారాయణ రావు ముందుగా ఊహించినట్లుగానే రుద్రమదేవి టీంకు శుభాకాంక్షలు చెబుతూనే… బ్రూస్ లీ ని టార్గెట్ చేశాడు.అది కూడా తుమ్మల రామసత్యనారాయణ చెప్పినట్లుగా…పెద్ద హీరోల
చిత్రాలు ఎపుడు రిలీజ్ అయితే అపుడే పండగ అన్న చందంగా దాసరి కూడా చెప్పడం…. పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దాసరికి కూడా కరెక్ట్ టైమ్ వచ్చినట్లుంది.అందుకే రుద్రమదేవి కి శుభాకాంక్షలుచెప్పినట్లే చెపుతూ తనలో కోపాన్ని కూడా ఇలా చూపించేశాడంటున్నారు.
