Sunday, May 11, 2025
- Advertisement -

బాబు నోటి వెంట ఈ ఇయర్ బెస్ట్ జోక్….

- Advertisement -

చంద్రబాబు రోజు రోజుకూ అత్యుత్సాహ పడిపోతున్నాడు. అలా అని చెప్పి సీమాంద్ర ప్రజలను, తన పార్టీ కార్యకర్తలను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే అలాంటి ప్రయత్నంలో చంద్రబాబు చెప్తున్న మాటలే వీర కామెడీ పుట్టిస్తున్నాయి. ప్రపంచానికే పాఠాలు చెప్పా. నా అంత అనుభవజ్ఙడు లేడు అని చెప్పుకునే చంద్రబాబు మాటలు రోజు రోజుకూ మరీ తీసికట్టుగా ఉంటూ ఉండడం గమనార్హం. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నాయకులు చేసిన కామెడీ గుర్తుందా. ఎన్ని స్థానాలో గెలుస్తారు అని అడిగితే ఓ రెండు సీట్లు తప్ప అన్నింటిలోనూ గెలుస్తాం అని చెప్పారు. చంద్రబాబుకు, వైఎస్‌కు మాత్రం చెరో సీటు వదిలేస్తాం …..మిగతావన్నీ మావే అని డప్పాలు కొట్టి కామెడీ అయిపోయారు.

ఇప్పుడు చంద్రబాబు అంతకుమించిన కామెడీ చేశాడు. ఈ సారి 2019లో జగన్‌కి కూడా ఒక సీటు ఇచ్చేది లేదన్నట్టుగా మాట్లాడేశాడు. మొత్తం సీట్లూ టీడీపికేనట. వైకాపాకు 0 సీట్లట. పోలా…….అదిరిపోలా…….2017 బెస్ట్ జోక్‌ని సంవత్సరాంతంలో భలే పేల్చాడు బాబు. కాకపోతే కనీసం ఒక్క శాతం అన్నా నమ్మేస్థాయిలో లేని ఈ చంద్రబాబు చెప్పిన మాటలతో ఆయనే కామెడీ అయిపోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? అయినా ఆ స్థాయిలో నమ్మకం నిజంగా ఉండి ఉంటే ఇన్ని రాజకీయ జిమ్మిక్కులు, వ్యూహాలు ఎందుకట? పోలీసులతో సహా మొత్తం వ్యవస్థలన్నింటినీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటూ తప్పులు చేస్తూ ఉండడం ఎందుకంట? జగన్‌ని విలన్‌గా చూపించడం కోసం అహర్నిశలూ కష్టపడడం ఎందుకట? నేను బెమ్మాండంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్ అడ్డుకుంటున్నాడు అని చెప్పి చేతకాని మాటలు మాట్లాడడం ఎందుకంట? మీడియాలోనే, సోషల్ మీడియాలోనో చిన్నపాటి విమర్శ కనిపించినా ఉలికిపాటు ఎందుకట? ఏంటో చంద్రబాబు……..మాటలకు చేతలకు ఒక్క శాతం పొంతన కూడా ఉండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -