తన ఇంట్లో శుభకార్యాలకు ఒకలాగా , అమరావతీ – రాజధాని శుభకార్యాల విషయంలో ఒకలాగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు అని వై కా పా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మండిపడ్డారు. ” హిందూ మత సాంప్రదాయాలూ , ఆచారాలను గౌరవించాల్సి ఉన్న ముఖ్య మంత్రి మంటగాలుపుతూ ఉన్నారు , ఆయన కి దేవుడు అంటే గౌరవం కాదు కదా కనీసం భయం కూడా లేదు “అని అన్నారు భాస్కర రెడ్డి.
ఈ నెల ఎనిమిది న చంద్రబాబు పెదనాన్న కుమారుడు వరసకి అన్నయ్య అయిన ఒక వ్యక్తి చనిపోయారు. ఇంటి పేరు కూడా” నారా ” కావడం తో ఆ అంటు చంద్రబాబు కి ఉంటుంది. అందుకే ఈ నెల 15 న తన మనవడి పుట్టి వెంట్రుకుల కార్యక్రమం కూడా పూర్తిగా వాయిదా వేసారు చంద్రబాబు కానీ. టీ టీ డీ కళ్యాణ మండపం లో “మైలు” తో లోపలి వెళ్లి హోమాలూ , పూజలూ చేసారు బాబు ఈని మీద ప్రతిపక్షాలు సీరియస్ అవుతున్నాయి.
మీడియా తో మాట్లాడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి నూతన రాష్ట్ర రాజధానికి ఇలా చేస్తే అరిష్టం అని హిందూ సంప్రదాయాల్ని చంద్రబాబు తుంగలో తొక్కుతున్నారు అని అన్నారు.
