వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ విజయాల కోసం ఆరాటపడుతున్నాడు. విజయం దక్కడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇటీవల జవాన్ సినిమా నిరాశ పరచడంతో ప్రస్తుతం మాస్ సినిమా దర్శకుడు వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ‘ఇంటెలిజెంట్’ టైటిల్ ఫిక్స్ చేశారంట.
ఈ సినిమాకు ధర్మాభాయ్ అనే టైటిల్‌ను అనుకున్నా క్యాచిగా ఉండాలనే ఉద్దేశంతో టైటిల్ మార్చేశారు. ‘ఇంటెలిజెంట్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. హీరో విలన్ల మధ్య మైండ్ గేమ్‌తో సాగే కథ కావడంతో ఇంటెలిజెంట్ అనే టైటిలే కరెక్ట్ అని భావిస్తున్నారట. త్వరలోనే టైటిల్‌ను ఫైనల్ చేసి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.