దర్శకుడు రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ మంచి జోడి. సక్సెస్ఫుల్ సినిమాలు వీరిద్దరి మధ్య ఎన్నో వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవికి రాఘవేంద్రరావు షాకిచ్చాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 151వ చిత్రం సైరా ఉయ్యలవాడ నర్సింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తనయుడు రామ్‌చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త విహారం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొంత మొదలై ఆగిన సంగతి అందరికీ తెలిసిందే.
దర్శకుడు సురేందర్‌రెడ్డి పనితీరుతో చిరంజీవి ఇబ్బంది పడుతున్నాడట. అతడి టేకింగ్ సంతృప్తికరంగా లేదని.. దర్శకుడిని మార్చేయాలని అనుకుంటున్నారని పుకార్లు వచ్చాయి. తొలిదశలో స్క్రిప్టు నెరేషన్ తదితర వ్యవహారాల్లో సురేందర్ రెడ్డి చిరంజీవిని మెప్పించినప్పటికీ.. షూటింగ్ మొదలయ్యాక చిరంజీవికి అంతగా నచ్చలేదని సమాచారం. దీంతో మరో దర్శకుడిని పెట్టాలని అనుకున్నారు. తనకు రీ ఎంట్రీ ఇచ్చిన వీవీ వినాయక్‌ను సంప్రదించారంట. చివరకు గుణశేఖర్‌ను కూడా సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వీరందరూ కాదని చివరికి తనకు సినీ జీవితం విజయవంతమవడానికి కారణమైన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును కూడా సంప్రదించారంట.
అయితే సినిమా తీయడానికి రాఘవేంద్రరావు నో చెప్పారని సమాచారం. రాఘవేంద్రరావు అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఆయన ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. భారీగా ఖర్చు చేస్తుండడంతో ఈ సినిమాను తన గురువు రాఘవేంద్రరావుతో మాట్లాడించారంట. ఆయన అంత ఆసక్తి చూపించలేదని, ఇప్పుడున్న పరిస్థితే బాగుందని సినిమా చేయనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.