అందాల రాక్షసితో పరిచయమైన లావణ్య త్రిపాఠి తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌లు ఉన్నప్పుడల్లా ఒక ఫైవ్ స్టార్ హోటల్ రూంలో ఉండాలి.. అంతంత అద్దెలు భరించడం.. లావణ్య తనకు అవకాశాలు ఫ్యూచర్ ఇక్కడే అని ఫిక్స్ అయిపోయారు. తనకూ ఒక ఇల్లు ఉండాలి అనే కోరికను ఇటీవల తీర్చేసుకుంది.
మంచి పాష్ ఏరియాలో కావలసిన వసతులు ఉన్న ఒక చక్కని ఇంటిని కొనుగోలు చేసిందని సమాచారం. లావణ్య అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటున్న ఫ్లాట్‌ను ఎంచుకున్నట్టు తెలిసింది. హోటల్‌లో ఉండడం ఇబ్బందిగా ఫీల్ అవుతూ వచ్చిన లావణ్య ఇప్పుడు కొత్త ఇల్లు ఉండడం పట్ల ఫుల్ హ్యాపీగా ఉందట. సంక్రాంతికి ఇల్లు గృహప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న లావణ్య ఇండస్ట్రీలో తనకు బాగా దగ్గరైన వాళ్లను – సన్నిహితులను కొందరిని ఆహ్వానిస్తోంది.
గతేడాది లావణ్యకు టైం అంతగా కలిసి రాలేదు. ఉన్నది ఒకటే జిందగీ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో – సాయి ధరమ్‌తేజ్ వస్తున్న సినిమాపై బాగా ఆశలు పెట్టుకుంది. తమిళ్‌లో కూడా కొన్ని సినిమాలు చేయనుంది.