బ్రూస్లీ డివైడ్ టాక్ వచ్చినా… రామ్ చరణ్ కాన్ఫిడెంట్ మాత్రం చెక్కు చెదర్లేదు.బహుశా మార్కెట్లో ఎవ్వరికీ దక్కని క్రెడిట్ చెర్రీకి దక్కేసింది. ఫ్లాప్ టాక్ వచ్చినా చెక్కు చెదరని ఇమేజ్ చెర్రీ సొంతమైంది. బ్రూస్ లీకి డివైడ్ టాక్ వచ్చాక.. కలెక్షన్స్ మీద చాలామంది అనేక అనుమానాలు వచ్చాయి.
దీనికి తోడు విజయదశమి రోజున మూడు కొత్త సినిమాలు రావడంతో అంతా బ్రూస్ లీని ఇక థియేటర్స్ నుంచి లేపేస్తున్నారనుకున్నారు.దాంతో చిత్రం మీద డౌట్స్ పెరిగిపోయాయి. వీటిలో ఒకటి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కావడంతో.. ఇక మెగాఫ్యాన్స్ కూడా బ్రూస్ లీ చిత్రాన్ని ఏం చూస్తారులే అనుకున్నారు. కాని బ్రూస్ లీ గురించి బయట చెపుకుంటోన్నంత బ్యాడ్ టాక్ థియేటర్స్ దగ్గర ఏం లేదని తేలిపోయింది.స్టిల్ బ్రూస్ లీని ఆదరించేవారు చాలామందే ఉన్నారు. బ్రూస్ లీ కిచ్చిన స్క్రీన్స్ లో 50 నుంచి 70శాతం స్క్రీన్స్ లో ఈ సినిమా ఇంకా కొనసాగుతుంది.ఇప్పటికే 30 కోట్లు ఈజీగా కొట్టేసిన మెగా పవర్ స్టార్ లాంగ్ రన్లో 45 కోట్ల వరకూ కొల్లగొడతాడని చెబుతున్నారు.దానికి బెస్ట్ ఎక్జాంపుల్ .. గోవిందుడు అందరివాడేలే చిత్రం. ఈసినిమా నెగిటివ్ తెచ్చుకున్నా…ఇలాగే 35 కోట్ల వరకూ రాబట్టేసింది. అదే సీన్ ఇపుడు బ్రూస్ లీ సినిమాకు కనబడుతుంది.