Thursday, May 2, 2024
- Advertisement -

20 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మొద‌టి సారి పెదవి విప్పిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్…

- Advertisement -

లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అనర్హత వేటు వేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగిన ఈ 20 మందిని అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సిఫారసు చేయగా.. నేడు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

ఎమ్మెల్యేల‌మీద అన‌ర్హ‌త వేటుప‌డిన త‌ర్వాత ఆపార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన కేజ్రీ పెదవి విప్పారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేవుడికి అంతా తెలుసని అన్నారు. మూడేళ్ల తర్వాత 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆయనకు ముందే తెలుసని ఆయన చెప్పారు. అందుకే ఆయన అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలుపొందే విధంగా చేశాడని ఆయన కొనియాడారు.

తమపై కొంతమంది కుట్రలు పన్ని తమ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించినా అనుకున్నది సాధించలేకపోయార‌న్నారు. ఆ తరువాత తనపై సీబీఐ దాడులు కూడా చేయించి నప్పటికీ ఫలితం శూన్యం. ప్రణాళికలేవీ ఫలించడం లేదని ఆందోళన చెందిన కుట్రదారులు…తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -