Thursday, May 8, 2025
- Advertisement -

ఎన్టీఆర్ సినిమా ఇళయరాజా సంగీతం..?!

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ హిట్ సినిమాల ఆడియోల్లో మాస్ బీట్ లే ఎక్కువ. ఆది, సింహాద్రి దగ్గర నుంచి పటాస్ వరకూ పాటల విషయంలో ఒకే రకమైన తీరు కనిపిస్తూ ఉంటుంది.

మణిశర్మ, దేవీశ్రీ ప్రసాద్, థమన్.. ఇలా ఎప్పటికప్పుడు..అప్పటికి ఫామ్ లో ఉన్న సంగీతకారులే జూనియర్ సినిమాలకు సంగీతం అందిస్తూ వస్తున్నారు.
మరి ఇలాంటి మొనాటనీకి ఎన్టీఆర్ బ్రేక్ ను ఇవ్వాలని భావిస్తున్నాడట! జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చనున్నాడని తెలుస్తోంది! మరి ఇంతకంటే పెద్ద విశేషం ఉండదేమో. ఎన్టీఆర్ వంటి అభిమానగణమున్న హీరో సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం ఒక డిఫరెంట్ కాంబో అవుతుంది.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి కూడా ఇళయరాజా  ఒకటీ రెండు సినిమాలకు సంగీతం అందించారు. ఇక  బాలయ్య.. ఇళయరాజా కాంబినేషన్ లో మ్యూజికల్ హిట్సే ఉన్నాయి! ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇది వరకూ చాలా సార్లు చెప్పాడు.. ఇళయరాజా తన కు ఇష్టమైన సంగీత దర్శకుడని.
ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రాబోయే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ ను అందించనున్నారని సమాచారం. మరి ఇది కచ్చితంగా డిఫరెంట్ కాంబినేషనే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -