- Advertisement -
కేథరిన్ అందం ఉన్నా లక్ లేని హీరోయిన్. తెలుగు ఇండస్ట్రీలో కేథరిన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం రావడం లేదు. గోపిచంద్‌తో గౌతమ్ నంద సినిమా కూడా ఫ్లాప్ కావడంతో నిరాశకు గురైంది కేథరిన్.అప్పుడప్పుడు ఐటం సాంగ్స్ చేస్తు బండి లాగిచేస్తుంది.వరుస సినిమా చేస్తు హిట్ మీద హీట్ కొడుతున్న హీరో నిఖిల్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.
నిఖిల్ ప్రస్తుతం కిర్రాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకుల ముందకు రావడానికి రెడీగా ఉన్నాడు. తరువాత సినిమాలో నిఖిల్ పక్కన హీరోయిన్గా నటించనుంది కేథరిన్. నిఖిల్ తరువాత సినిమా కూడా రీమేక్ కావడం ఇక్కడ మరో విశేషం. తమిళనాట సంచలన విజయం సాధించిన కనితన్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నాడు.