Monday, May 12, 2025
- Advertisement -

మోడీ అంటే భయం కాదు…. బాబు గుంటనక్క కుట్రలకు మద్దతివ్వకూడదనేః జగన్

- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన తర్వాత నరేంద్రమోడీని వైఎస్ జగన్ ఎందుకు విమర్శించడం లేదు. చంద్రబాబును మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అంతకుముందు ప్రత్యేక హోదా విషయంలో కూడా మోడీకంటే చంద్రబాబునే ఎక్కువగా విమర్శించాడు వైఎష్ జగన్. నరేంద్రమోడీ అంటే జగన్‌కి భయమా? కేంద్రం స్థాయిలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వైఎస్ జగన్ స్టాండ్ ఏంటి? ఇదే విషయంపై జగన్ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ ప్రత్యేకంగా ఇంటర్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కానీ కొన్ని ఆసక్తికర విషయాలు అయితే చెప్పుకొచ్చాడు.

రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ప్రస్తావించాడు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం పోరాటం చేశాడు జగన్. నిరాహారదీక్ష చేశాడు. తెలంగాణా ప్రాంతంలో వైకాపాకు స్థానం లేకుండా పోతుందన్న విషయం తెలిసి కూడా జగన్ సీమాంధ్ర ప్రయోజనాల కోసం పాటుపడ్డాడు. అయితే అప్పటికే సోనియాతో కుమ్మక్కయి ఉన్న చంద్రబాబు మాత్రం రెండు కళ్ళ సిద్ధాతం డ్రామాతో సీమాంధ్రులను పూర్తిగా ముంచాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడకుండా ఉండి ఉంటే రాష్ట్ర విభజన ప్రస్తావనే ఉండేది కాదు. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ బలానికి భయపడి…. కేవలం జగన్‌కి నష్టం చేయాలన్న ఉద్ధేశ్యంతో సోనియాతో కుమ్మక్కయి తెరవెనుక ఉండి రాష్ట్ర విభజనతో సహా అన్ని డ్రామాలను కూడా నడిపించాడు. తెర ముందు మాత్రం పచ్చ మీడియా ప్రచారంతో జనాలకు మరో సిినిమా చూపించాడు. నాడు కెసీఆర్‌తో కూడా జగన్ కుమ్మక్కయ్యాడని జనాలను నమ్మించారు.

ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల గురించి చర్చించుకుందాం. కెసీఆర్-చంద్రబాబులు వెలమ-కమ్మ గ్రూపును తయారుచేస్తున్నారని చంద్రబాబు ప్రధాన భజన మీడియా అధినేత మహదానందంగా సగర్వంగా చెప్తున్నాడు. వైఎస్ చనిపోయిన తర్వాత నుంచీ కూడా అధికారంలో ఉన్నంత కాలం సోనియాను పల్లెత్తు మాట అనని చంద్రబాబు……ఎన్నికల సమయంలో మోడీతో పెట్టుకున్న తర్వాత మాత్రం సోనియాను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఇక ఇప్పుడు కూడా పచ్చ మీడియా వెనకాల దాక్కుని మోడీపై యుద్ధం చేస్తున్నానన్న స్థాయిలో బిల్డప్పులు ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇప్పటి వరకూ స్పందించింది లేదు. అధికార బలం ఉన్నవాళ్ళతో చంద్రబాబు ఇలా తెరవెనుక కుమ్మక్కు కావడం….తెరముందు మాత్రం టిడిపి ఎంపీలు, పచ్చ మీడియా డ్రామాలాడుతూ ఉండడాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు జగన్. ఇప్పుడు వైకాపా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చంద్రబాబు ఇంకాస్త స్వార్థంతో వ్యవహరిస్తూ తెరవెనుక ప్రయోజనాలను మోడీ నుంచి పొందడం తప్ప రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదని చెప్పాడు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా వంచించిన చంద్రబాబుకు బడ్జెట్‌లో జరిగిన అన్యాయం విషయం పెద్ద విషయమే కాదని, తెరవెనుక సీట్ల పెంపుకోసం పట్టుబట్టడమే చంద్రబాబు లక్ష్యం అని చెప్పుకొచ్చాడు జగన్. మోడీకి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తే ప్రజల్లో వ్యతిరేకతను మేనేజ్ చేస్తాను అని చెప్పి మోడీ సీట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకునేలా చంద్రబాబు వ్యూహం రచిస్తాడని చెప్పుకొచ్చాడు జగన్. మోడీతో చంద్రబాబు, సుజనా చౌదరిలు సమావేశమైన సందర్భంలో సీట్లు పెంపు గురించి తప్ప మరో అంశం ఏదీ చర్చకు రాలేదన్న విషయం నిజం అని చెప్పుకొచ్చాడు జగన్.

రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న చంద్రబాబు స్వార్థ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చే్స్తున్నంత కాలం నరేంద్రమోడీకి రాష్ర్ట ప్రయోజనాల గురించి ఆలోచించాల్సిన అవసరం రాదని జగన్ అన్నాడు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలు నెరవేరిస్తే రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా కూడా 2019లో బిజెపికి, టిడిపికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓట్లు వేసేలా నేను చేస్తానని చంద్రబాబు తెరవెనుక హామీలు ఇస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ఆంద్రప్రదేశ్ గురించి పట్టించుకుంటుందని చెప్పుకొచ్చాడు జగన్. రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాతం అంటూ తెలంగాణా ఏర్పాటుకు సహకరించినప్పటికీ, తెలంగాణాను ఏర్పాటు చేయాలని సోనియాను డిమాండ్ చేస్తూ లేఖ రాసినప్పటికీ సీమాంధ్ర ప్రజలను 2014ఎన్నికల్లో మేనేజ్ చేయలేదా? విభజన పర్వంలో బిజెపిది కూడా కాంగ్రెస్‌తో సమానమైన పాత్ర అయినప్పటికీ బిజెపికి కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓట్లేసేలా చేశానుగా అన్నది చంద్రబాబు నమ్మకం అని…….అందుకే చంద్రబాబు గుంటనక్క రాజకీయాలకు సహకరించకూడదనే కేంద్ర స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని చెప్పాడు జగన్. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వాళ్ళతోనే వైకాపా పొత్తు పెట్టుకుంటుందని……హోదా ఇవ్వకపోతే మోడీతో సహా ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తేలేదని తేల్చిచెప్పాడు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -