Tuesday, May 13, 2025
- Advertisement -

బాబు ’దేశం‘ కోసం భారతదేశాన్ని ముక్కలుగా నరికేద్దామా పవన్?

- Advertisement -

రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ అజ్ఙానం మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంది. పవన్ అజ్ఙానం, మూర్ఖత్వంతో పరిణామాలు ఇంకా ఎంతలా దిగజారుతాయోనన్న ఆందోళన మాత్రం మేథావి వర్గాలో వ్యక్తమవుతోంది. తన మూఢాభిమానులను రెచ్చగొట్టడం…….. మరి కాస్త మూర్ఖులను చేయడమే పనిగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు పవన్. మొత్తంగా చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశానికి బంటు అయిన పవన్….. బాబు ప్రయోజనాల కోసం భారతదేశాన్ని ముక్కలుగా నరికేసే రాజకీయాలు కూడా చేసేలా ఉన్నాడు. మామూలు మనిషికి కూడా మాట చాలా ముఖ్యం. ఇక నాయకుడికి అంతకుమించిన నిబద్ధత ఉండాలి. కానీ పవన్‌కి తెలుగు దేశం ప్రయోజనాలు తప్ప ఇంకేమీ పడుతున్నట్టు లేవు. అందుకే మరీ మూర్ఖంగా రాజకీయాలు చేస్తున్నాడనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాగే అన్యాయం జరుగుతూపోతే భారతదేశం రెండు ముక్కలవుతుందని ఇష్టారీతిన మాట్లాడుతున్నాడు పవన్. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగింది అన్న మాట నిజం. కానీ ఆ అన్యాయానికి ఉత్తర భారతదేశం ప్రజలందరూ కారణమయ్యారా? సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలంగాణాకు అన్యాయం చేసింది ఎవరు? తెలంగాణా నాయకుల చేతకాని తనం…….. సీమాంధ్ర నాయకుల స్వార్థ రాజకీయాలేగా. అందులో ప్రజలకు ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఇక విభజన నాడు సీమాంధ్ర పూర్తిగా నష్టపోవడానికి కారణం ఎవరు? చేతకాని చవట రాజకీయాలు చేసి సోనియా దగ్గర ఊడిగం చేసిన పవన్ అన్నయ్య చిరంజీవి, అత్యంత అనుభవజ్ఙుడు, అప్పటి ప్రతిపక్షనాయకుడు అయిన చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం వ్యవహరించడం లాంటివి కారణాలు కావా? ఇక పవన్ చేసింది మాత్రం ఏముంది? విభజనకు ముందు బయటకు వస్తే విభజన సమస్యను తాను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంచక్కా ఫాం హౌస్‌లో షూటింగ్‌లో ఎంజాయ్ చేస్తూ ఉండిపోయి అంతా అయిపోయాక ఆరున్నొక్కరాగం తీస్తూ ఆవేధన నటించాడు. ఇక చంద్రబాబుతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి నడిపిన నాటకాలు, ఆరడుగుల బుల్లెట్ అశోక్ బాబు చంద్రబాబుకు ఉపయోగపడేలా నడిపించిన ఉద్యమం, లగడపాటి కామెడీ వ్యవహారాలు……అన్నింటికీ మించి సీమాంధ్ర పాలిట శాపంలా పరిణమించిన పచ్చ మీడియా వ్యవహారాలు కాదా? అయినా పవన్‌కి అసలు విభజన గురించి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? తన మూర్ఖపు తెలివితేటలతో విభజనకు ప్రధాన కారణమైన నరేంద్రమోడీ సారథ్యంలోని బిజెపికి సీమాంధ్రుల చేత ఓట్లేయించింది ఇదే పవన్ కళ్యాణ్ కాదా?

అప్పుడంతా నమోవారు బాబుకు నచ్చేశాడు కాబట్టి పవన్‌కి కూడా నచ్చేశాడు. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత మోడీ మొహం బాబుకు నచ్చడంలేదు కాబట్టి పవన్‌కి కూడా నచ్చకుండా పోతున్నాడు. 2019 ఎన్నికల్లో మోడీతో కలిసి బరిలో దిగితే ఘోర పరాజయం ఖాయం అన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దెబ్బకు బాబు గింగిరాలు తిరిగిపోతున్నాడు. అందుకే ఎలా అయినా మోడీని వదిలించుకోవాలని చూస్తున్నాడు. పవన్‌బాబు రాజకీయం మొత్తం బాబు కోసమే కాబట్టి ఇప్పుడు ఉత్తర-దక్షిణ భారతదేశం పాట పాడుతున్నాడు. అయినా మోడీని ద్వేషించండి……. మోడీకి ఓట్లెయ్యొద్దు అని 2019లో ప్రచారం చేయడానికి భారతదేశాన్ని ముక్కలుగా నరికేయండి అనే స్థాయి దుర్మార్గపు రాజకీయం అవసరమా? మోడీ ఉత్తర భారతదేశపు వ్యక్తి కాబట్టి ఓడించడండి అని చెప్పి విభజన రాజకీయాలు చేయడం ఎందుకు? అదేదో 2014లో బుద్ధిలేక మోడీకి ఓట్లేయమని చెప్పాం…….2019లో మాత్రం మోడీకి ఓట్లెయొద్దు అని బాబు, పవన్‌లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎదుట లెంపలు వేసుకుంటే కాస్త నిజాయితీగా ఉంటుందేమో కదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -