సైన్యం నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్, ఒక పాట విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ దేశ సరిహద్దులో సందడి చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సైనికులతో సరదాగా గడుపుతున్నారు. అయితే వారితో కలిసి సరదాగా వాలీబాల్ ఆడడం అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భారత్-పాక్ సరిహద్దులో శరవేగంగా జరుగుతోంది. సినిమాకు షూటింగ్ కీలకమైన సీన్స్ తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జమ్మూకశ్మీర్‌లో చేస్తున్నారు. చలికాలం అతికష్టంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిలో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయాలని ప్లాన్.
ఈ సినిమాలో బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా బొమన్ ఇరానీ, శరత్‌కుమార్, అనూప్ సింగ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.