రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష చేసిన జగన్‌ని సోనియాతో కుమ్మక్కయ్యాడు అన్న విష ప్రచారంతో కార్నర్ చేశారు. తెలంగాణా ఏర్పాటు చేయమని జగనే స్వయంగా సోనియాకు చెప్పి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించాడు అనే స్థాయిలో ప్రచారం చేశారు. ఆ రకంగా అబద్ధపు ప్రచారంతో రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ సీమాంధ్రకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు చేతకానితనన్ని కవర్ చేశారు.
ఇక ఇప్పుడు కూడా అదే గేం ఆడబోయారు. రాజీనామాలు చేస్తాం అని నిర్ణయం తీసుకున్న జగన్‌ని ఎద్దేవా చేశారు. బడ్జెట్ నాటి నుంచీ కూడా రాజీనామాలు చేస్తామన్నారుగా…… ఎందుకు చెయ్యలేదు……. మోడీకి భయపడ్డారా అంటూ బాబుతో సహా టిడిపి నేతలందరూ ఎటకారాలు ఆడారు. కట్ చేస్తే రాజీనామాలు చేయడానికి రెడీ అని ప్రకటించిన జగన్ డేట్ కూడా ఇచ్చేశాడు. ఆ వెంటనే రాజీనామాలది ఏముంది? ఎలాగూ ఇప్పుడు ఎన్నికలు రావని రాజీనామాలు అంటున్నాడు…… రాజీనామాలతో ఒరిగేది ఏముంటుంది అని సన్నాయి నొక్కులు నొక్కారు. భజనసేనుడు పవన్ చేత దమ్ముంటే అవిశ్వాసం పెట్టు అంటూ జగన్‌కి సవాల్ విసిరేలా చేశారు. జగన్‌ని గట్టిగా దెబ్బకొట్టాం అనుకున్నారు.
కట్ చేస్తే అవిశ్వాసానికి రెడీ అని జగన్ ప్రకటించాడు. నీ పార్ట్నర్ బాబును కూడా ఒప్పించమని పవన్‌కి ఛాలెంజ్ విసిరాడు జగన్. ఆ దెబ్బతో పచ్చ బ్యాచ్‌కి మైండ్ బ్లాంక్ అయింది. ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా బాబును ఒప్పిస్తాడా? లేదా? అనే విషయం చెప్పకుండా కవితను ఒప్పిస్తా….కర్ణాటకను ఒప్పిస్తా….. దేశం మొత్తాన్ని ఒప్పిస్తా అని ప్రగల్బాలు పలికాడు. ఇక బాబుగారు కూడా అవిశ్వాసం వళ్ళ ఉపయోగం ఏముంది? వేస్ట్ అని మొదలెట్టాడు. మరి ఏం చేస్తే బాగుంటుందో మాత్రం చెప్పడు. పోరాటం చేశాం……. చేస్తున్నాం…… చేస్తూనే ఉంటాం అని ఒక రొటీన్ డైలాగ్ మాత్రం కొడుతూ ఉంటాడు. నాలుగేళ్ళుగా బాబు చేస్తున్న పోరాటం ఏంటి అంటే మాత్రం పచ్చ మీడియా కూడా చెప్పలేదు. పచ్చ మీడియాలో లీకులు ఇప్పించడం…..బ్రతిమాలి, బ్రతిమాలి అపాయింట్మెంట్ తెచ్చుకుని ఢిల్లీ వెళ్ళి రావడమే పోరాటమేమో మరి బాబుగారి దృష్టిలో.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాబు అండ్ కో సందేహాలన్నీ ఒక్కటే. జగన్ ధైర్యం ఏంటి? సోనియాకు ఎదురుతిరిగి కేసుల్లో ఇరుక్కున్నది సరిపోలేదా? ఇప్పుడు మోడీతో కూడా ఢీ కొనడం ఏంటి? అధికారంలో ఉన్న మనమే అణిగిమణిగి ఉంటే జగన్ మాత్రం రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం అంటూ దూకుడుగా వెళ్ళడం ఏంటి? జగన్ దూకుడును మనం ఎలా కౌంటర్ చేయాలి? జగన్‌వి స్వార్థ ప్రయోజనాలు, కుట్రలు అని చెప్పి జనాలను నమ్మించడం ఎలా? మన చేతకానితనాన్ని సమర్థించుకోవడం ఎలా? ఇప్పుడు బాబు అండ్ కో అధ్యయనం చేస్తున్న విషయాలు ఇవే. ఇప్పటి వరకూ సమైక్యాంధ్ర కోసం నిరాహార దీక్ష, దొంగ హామీలు ఇవ్వకపోవడం, ప్రత్యేక హోదా కోసం నిరంతరాయంగా పోరాడుతూ ఉండడం లాంటి విషయాలతో జగన్ నిజాయితీ, నిబద్ధత ప్రజలకు అర్థమవుతూనే ఉన్నప్పటికీ మరోవైపు పచ్చ మీడియాతో కలిసి బాబు, పవన్‌ల బ్యాచ్ చేసిన అబద్ధపు ప్రచారాలను కూడా చాలా మంది నమ్మారు. కానీ ఫస్ట్ టైం రాజీనామాలు, అవిశ్వాసతీర్మానం విషయంలో మాత్రం బాబు అండ్ కోకి తనను విమర్శించే అవకాశం, అబద్ధపు ప్రచారాలతో జగన్ నిబద్ధత, నిజాయితీని ప్రజలు శంకించేలా చేయడానికి పచ్చ బ్యాచ్‌కి అవకాశం లేకుండా చేశాడు జగన్.