దేవుడా…….లోకేష్ దురదృష్టం ఏంటోగానీ 2014లో బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ చంద్రబాబు ప్రతి వైఫల్యం కూడా ఫైనల్‌గా లోకేష్ బుక్కయ్యేలా చేస్తోంది. ఓటుకు కోట్లు కేసుని ఎలా సమర్థించుకోవాలో తెలియక మీడియాకు అడ్డంగా దొరికాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమికి లోకేష్‌ని బాధ్యుడిని చేశారు. వీటన్నింటికీ తోడు తన చిన్నపిల్లల స్థాయి మాటలు, తడబాటుతో చాలా సార్లు కామెడీ అయిపోయాడు నారా లోకేష్. చంద్రబాబు, బాబు భజన బృంద నాయకులతో పాటు పచ్చ మీడియా అంతా కూడా ఎంత జాకీలు వేసి లేపాలని ప్రయత్నాలు చేస్తున్నా కూడా లోకేష్ బాబు మాత్రం తన చేతలు, మాటలతో ప్రతిసారీ బుక్కవుతూనే ఉన్నాడు.
ఇప్పుడు చివరి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి మోడీ చిప్ప చూపించడంతో సీమాంధ్ర ప్రజలు మొత్తం ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. 2014 నుంచీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై జగన్ పోరాటం చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇక తన స్వార్థం కోసం హోదా వద్దని చెప్పి ప్యాకేజ్‌కి ఒప్పుకున్న చంద్రబాబును విమర్శలతో ఉతికి ఆరేశాడు జగన్. ప్యాకేజ్ ప్రకటించిన వెంకయ్య, అరుణ్ జైట్లీలకు సన్మానాలు చేసినప్పుడు అయితే ఆవేధన వ్యక్తం చేస్తూ ఐదు కోట్ల ప్రజల గొంతుక అయి నిలిచాడు. ఇప్పుడు కూడా జగన్ అదే చేస్తున్నాడు. ఎన్నికల సంవత్సరం రావడంతో ఓట్ల కోసం చంద్రబాబు ప్లేట్ ఫిరాయిస్తూ ఉన్నాడు. మీడియాతో మాయ చేస్తున్నాడు.
అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైకాపా, కమ్యూనిస్టు నాయకులు, జనసేన నాయకుడు…. మేధావులు, స్వచ్ఛంధ సంఘాల వారు కూడా స్పందించారు. కానీ ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడని నాయకుడు మాత్రం లోకేష్ ఒక్కడే. చంద్రబాబు కూడా మీడియాకు లీకులిస్తూ మోడీపై పోరాటం చేస్తున్నానన్న కలరింగ్ ఇచ్చి జనాలను నమ్మించడానికి నానా పాట్లూ పడుతున్నాడు కానీ లోకేష్ మాత్రం పూర్తిగా అజ్ఙాతంలోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడి ఏం కొంపలు ముంచుతాడో అన్న భయంతో లోకేష్‌ని సైలెంట్ చేశాడో లేక మోడీతో చిన్నపిల్లాడు పెట్టుకోవడం ఎందుకులే అని అనుకున్నాడో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం లోకేష్‌ని పూర్తిగా అజ్ఙాతంలో ఉంచేశాడు. ఇప్పుడు ఇదే వ్యవహారంపై లోకేష్‌ని ఉతికి ఆరేస్తున్నారు నెటిజనులు. ఆ మధ్య ఎన్ఆర్ఎలు అని అంటూ చాలా మందికి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత లేదు అని, నారావారి కుటుంబానికి మాత్రమే ఉందన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడని…….. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆవేధనతో రగిలిపోతూ ఉంటే లోకేష్ ఎవరికి భయపడి అజ్ఙాతంలో దాక్కున్నాడో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు యూత్ ఐకాన్ అని ఈ మధ్యనే చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఆ యువత అంతా ఆందోళనలో ఉంటే తను మాత్రం అజ్ఙాతంలో ఉండడం ఏంటని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా బాబు చేతగానితనం, బానిసత్వం పుణ్యమాని మరోసారి లోకేష్ అడ్డంగా బుక్కయ్యాడు అన్నది మాత్రం నిజం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో అన్యాయం జరిగిన తర్వాత అజ్ఙాతం వీడి బయటకు రావడానికి చంద్రబాబుకు పక్షం రోజులు పట్టింది. ఇక లోకేష్ ఎప్పుడు వస్తాడో చూడాలి మరి.