Tuesday, May 6, 2025
- Advertisement -

‘యూత్ ఐకాన్’….. చంద్రబాబు, లోకేష్‌లపై హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు

- Advertisement -

జబర్ధస్త్ షోలో ఉన్న ఇతర కంటెస్టెంట్స్, స్క్రిప్ట్ రైటర్స్‌తో కంపేర్ చేస్తే హైపర్ ఆదికి కాస్త పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువే. అందుకే తరచుగా తన స్కిట్స్‌లో అలాంటి విషయాలపై సెటైర్స్ కనిపిస్తూ ఉంటాయి. మహేష్ కత్తి వర్సెస్ పవన్ ఇష్యూలో కూడా హైపర్ ఆది యాక్టివ్ పార్టిసిపేషన్ ఇచ్చాడు. అయితే అప్పట్లో పవన్‌ని సమర్థిస్తూ హైపర్ ఆది మాట్లాడిన మాటలు ఎవరికీ నచ్చలేదు. కానీ మనవాడు ధైర్యంగా ముందుకు వచ్చి తన వెర్షన్‌ని వినిపించడాన్ని మాత్రం చాలా మంది అభినందించారు. ఆ తర్వాత నుంచీ కూడా పాలిటిక్స్‌పై కూడా తన పంచ్‌లను గట్టిగానే పేలుస్తున్న హైపర్ ఆది తాజా స్కిట్‌లో లోకేష్, చంద్రబాబులపై పంచ్‌లు వేశాడు.

లోకేష్ బర్త్ డే సందర్భంగా ‘తెలుగు యూత్ ఐకాన్’ అంటూ తన భజన తాను చేసుకున్నట్టుగానే తన కొడుకు భజనను కూడా గట్టిగా చేసుకున్నాడు చంద్రబాబు. అదేదో ఆంధ్రప్రదేశ్ యూత్ ఐకాన్ అని ఉన్నా ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కొంతమంది అయినా యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళేమో. కానీ ప్రపంచానికి పాఠాలు చెప్పా అని తన డప్పు తానే కొట్టుకునే చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ని కేవలం ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే యూత్ ఐకాన్‌ని చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ఏకంగా తెలుగు వారందరికీ యూత్ ఐకాన్ అనేశాడు. ఆ తర్వాత ఈ యూత్ ఐకాన్ లోకేష్ అనే విషయం చుట్టూ నెట్‌లో జోకులు మామూలుగా పేలలేదు. చంద్రబాబు, లోకేష్‌లపై పంచ్ డైలాగ్స్‌తో, సెటైర్స్‌తో ఇద్దరినీ కూడా కమెడియన్స్ చేసిపడేశారు నెటిజనులు. ఇప్పుడు తన తాజా స్కిట్‌లో హైపర్ ఆది కూడా ఇదే విషయంపై సెటైర్స్ వేశాడు. ‘ఎవడుబడితే వాడు యూత్ ఐకాన్ అయిపోతున్నప్పుడు….’ అంటూ ఆది వేసిన పంచ్‌కి రోజా హిలేరియస్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా రక్తికట్టిస్తున్నాయి. మొత్తానికి తన గురించిన అతిశయోక్తులు ఎన్నో చెప్పుకుంటూ అబద్ధాల నాయకుడిగా, పొలిటికల్ కమెడియన్‌గా సెటైర్స్ వేసుకుంటూ ఉండే చంద్రబాబు ఇప్పుడు లోకేష్ గురించి కూడా ‘తెలుగు యూత్ ఐకాన్’ అని చెప్పి నెట్‌లో, టివి కామెడీ షోలలో కామెడీ ఐటెంని చేసి పడేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -