Monday, May 5, 2025
- Advertisement -

‘అ!’ హీరోయిన్ ప్రేమిస్తున్న హీరో ఇత‌డేనా..?

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్లు తెలుగు క‌న్నా ముంబాయి, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, పంజాబ్ ఇలా ఇత‌ర రాష్ట్రాల హీరోయిన్లే ఎక్కువ‌గా ఉన్నారు. తెలుగు నుంచి హీరోయిన్లుగా వ‌చ్చినా వాళ్లంతా అంద‌చందాలు చూపించ‌క‌పోవ‌డంతో మ‌న వాళ్లు తెలుగు హీరోయిన్ల‌కు అవ‌కాశాలే ఇవ్వ‌డం లేదు. తెలుగుద‌నం అంటేనే సంప్ర‌దాయం. మ‌రీ ఎలా మొత్తం చూపిస్తారు. అందుకనే న‌ట‌న‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌నే తెలుగు హీరోయిన్లు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో అవ‌కాశాలు త‌క్కువ వ‌స్తాయి. ఇప్పుడు ఈషా రెబ్బాకు కూడా అంతే సంగ‌తులు. సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి దాదాపు ఐదేళ్లు దాటి ఉంటాయి. కానీ ఒక ఐదారు సినిమాలు కూడా చేయ‌లేదు. ఆ విధంగా ఉంటుంది.. అయితే ఇప్పుడు చెప్పే విష‌య‌మేమంటే ఈ హీరోయిన్ ఓ హీరోతో ప్రేమాయణం సాగిస్తోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి.

గ‌తేడాది ఈష ‘మాయా మాల్‌` అనే సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ షూటింగ్ స‌మ‌యంలో హీరో దిలీప్‌తో మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డి ల‌వ్ ప‌ట్టాలు ఎక్కింద‌ని స‌మాచారం. అత‌డితో ప్రేమ‌యాణం సాగిస్తోంద‌ని టాలీవుడ్‌లో ఈ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇటీవ‌ల నాని నిర్మాణంలో ఈషా ‘అ!’ సినిమాలో డిఫెరెంట్ రోల్‌లో న‌టించిన ఈష ఇప్పుడు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఆమె సింపుల్ నటన సినిమాలో హైలెట్‌గా నిలవ‌డంతో త‌ర్వాతి సినిమాలు కూడా అలాంటి మంచి కథలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం తేజ ద‌ర్శ‌క‌త్వంలో నారా రోహిత్, ద‌గ్గుబాటి వెంకటేశ్ న‌టిస్తున్న సినిమాకు ఈష ఎంపికైంది.

మ‌రీ ఈ స‌మ‌యంలో ల‌వ్ ట్రాక్ విష‌యం ఏమైంది చూడాలి. ఈ విషయంలో నిజమెంతో తెలియదు కాని.. అటు ఆఫర్లు ఇటు రూమర్లతో ఇష ఇప్పుడు బిజీ అయిపోయింద‌నే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -