- Advertisement -

ప్రొఫెస‌ర్ గెట‌ప్‌లో వెంక‌టేశ్‌.. లుక్ చూస్కొండి

- Advertisement -

‘ఆట నాదే వేట నాదే’ అంటూ విక్టరీ వెంకటేశ్ ద‌ర్శ‌కుడు తేజతో వ‌స్తున్నాడు. ద‌ర్శ‌కుడు తేజ‌తో వెంకీ న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాకు ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. ప‌రిశీలనలో ఉంది. డిసెంబర్‌లో మొద‌లైన ఈ సినిమా షూటింగ్ కొన‌సాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి వెంక‌టేశ్ స్టిల్‌‌ ఒకటి బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌డంతో ఆ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో వెంక‌టేశ్ ఆచార్యుడిగా (ప్రొఫెస‌ర్‌)గా క‌నిపిస్తున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఒక చేతిలో బ్యాగ్‌, మరో చేతిలో పుస్తకాలు పట్టుకుని మెట్లు ఎక్కుతున్న వెంకీ స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా శ్రియ నటిస్తోంది. వెంక‌టేశ్‌, శ్రియ‌కు ఇద్ద‌రు పిల్లలు ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. ‘గోపాల గోపాల’ సినిమా త‌ర్వాత శ్రియతో మ‌ళ్లీ వెంకీ న‌టిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్‌, జూలైలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -