‘ఆట నాదే వేట నాదే’ అంటూ విక్టరీ వెంకటేశ్ దర్శకుడు తేజతో వస్తున్నాడు. దర్శకుడు తేజతో వెంకీ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. పరిశీలనలో ఉంది. డిసెంబర్లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ స్టిల్ ఒకటి బయటకు విడుదల చేయడంతో ఆ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో వెంకటేశ్ ఆచార్యుడిగా (ప్రొఫెసర్)గా కనిపిస్తున్నాడు. కళ్లజోడు పెట్టుకుని ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో పుస్తకాలు పట్టుకుని మెట్లు ఎక్కుతున్న వెంకీ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా శ్రియ నటిస్తోంది. వెంకటేశ్, శ్రియకు ఇద్దరు పిల్లలు ఉండనున్నట్టు సమాచారం. ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత శ్రియతో మళ్లీ వెంకీ నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్, జూలైలో విడుదల చేసే అవకాశం ఉంది.
