రాజ‌కీయ‌నాయ‌కుడిగా ప‌వ‌ర్ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ జ‌గ్గుబాయ్‌…

హీరో తండ్రిగానో .. హీరోయిన్ తండ్రిగానో రిచ్ లుక్ తో జగపతిబాబు సినిమాల్లో కనిపిస్తూ ఉంటాడు. విల‌న్ పాత్ర‌ల్లోనూ త‌న‌కు త‌నే సాటి అని నిరూపించ‌కున్నాడు. ఇక పవర్ఫుల్ పాత్రల్లోను తన సత్తా చాటడంలో ఆయనకి ఆయనే సాటి.

అలాంటి జగపతిబాబు తాజాగా ‘నేల టికెట్’ సినిమా చేస్తున్నాడు. రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో బలమైన ఓ రాజకీయనాయకుడిగా జగపతిబాబు కనిపిస్తాడట.

హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆయన పాత్రను కల్యాణ్ కృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దాడని అంటున్నారు. ఇంతవరకూ జగపతిబాబు చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. నువ్వా? నేనా? అన్నట్టుగా రవితేజ .. జగపతిబాబు తలపడే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.