Monday, May 6, 2024
- Advertisement -

బావ సాఫ్ట్‌లుక్‌.. బామ్మ‌ర్ది కూల్‌లుక్‌లో

- Advertisement -

తేజ సినిమాలో వెంకీ, నారా రోహిత్ లుక్ విడుద‌ల‌

ద‌ర్శ‌కుడు తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆట నాదే.. వేట నాదే సినిమాలో ద‌గ్గుబాటి వెంకటేశ్‌, నారా రోహిత్ బావ‌బామ‌ర్దులుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో వెంక‌టేశ్ అధ్యాప‌కుడి గెట‌ప్‌లో క్లాసీ లుక్‌లో క‌నిపించాడు. ఇప్పుడు ఆయ‌న బామ‌ర్దిగా న‌టిస్తున్న నారా రోహిత్ లుక్‌ను వ‌దిలారు. మొదట ఈ పాత్ర కోసం వేరే హీరోలను అనుకున్నా చివరికి నారా రోహిత్‌ను ఫైన‌ల్ చేసేసి షూటింగ్‌ను ప్రారంభించారు.

మార్చి రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. శ్రియ నారా రోహిత్ అక్క‌గా వెంకీకి భార్య‌గా న‌టిస్తోంది. ఇషా రెబ్బ వెంక‌టేశ్ చెల్లెలిగా నారా రోహిత్ భార్య‌గా న‌టించే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్ లుక్‌లో ఆక‌ట్టుకున్న బావ వెంకటేశ్ అదే తరహాలో బామ‌ర్ది ఇన్‌షెట్ వేసుకొని జేబులో చేతులు పెట్టుకొని నిల‌బ‌డిన నారా రోహిత్ క‌నిపించాడు. రోహిత్ కూల్‌లుక్‌లో కనిపించాడు. ఈ సినిమా షూటింగ్ వేగంగా చేస్తున్నారు. జూన్‌లో ఈ సినిమాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -