స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీ, హవాయి, ఓరేగాన్ వర్సిటీలు కలిసి ‘సెక్స్’ గురించి సరికొత్త పరిశోధనలు చేసి ఆ వివరాలను ప్రపంచానికి అందించారు. సెక్స్ విషయంలో మనుషుల దృక్పథం ఎలా ఉంది.. అనే దిశగా సాగిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.
ఈ అధ్యయనం ప్రకారం… సెక్స్ లో తరచుగా పాల్గొనే వారి రూపం అందంగా తయారవువుతంది! సెక్స్ లో చురుకుగా పాల్గొనే ఆడవాళ్లకు అంటు వ్యాధులు సోకే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి. వారానికి ఒకటీ, రెండు సార్లు సెక్స్ లో పాల్గొంటే వారిలో రోగ నిరోధక శక్తి 30 శాతం వరకూ మెరుగవుతుంది.
ఇక సెక్స్ లా పాల్గొంటున్న దంపతుల్లో భావప్రాప్తి తేడాలు మాత్రం తప్పట్లేదట. వీరిలో పరస్పర సహకారం లేకపోవడంతో భావప్రాప్తుల్లో తేడాలున్నాయని ఈ అధ్యయనకర్తలు తేల్చారు. సెక్స్ సమయంలో ఆడవాళ్లకు కనీసం 20 నిమిషాల పాలు ఫోర్ ప్లే ఉండాల్సిందేనని ఈ అధ్యయనకర్తలు తేల్చడం విశేషం. సెక్స్ లో చురుకుదనం లేకపోవడం.. భర్త తీరు వల్ల కనీసం 30 శాతం మంది మహిళలకు భావప్రాప్తి అంటే ఏమిటో కూడా తెలీకుండానే సెక్స్ లైఫ్ ముగుస్తోందని ఈ అధ్యయనకర్తలు వివరించారు.
ఇక సెక్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నది ఏకాంతంగా ఉంటున్న దంపతులేనట. పిల్లలు చదవుల్లో బిజీ అయిపోయిన దశలో.. ఏకాంతంగా ఉంటున్న దంపతులు వయసుఅడ్డంకులు లేకుండా శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.
