మొన్న పెళ్లి చేసుకోబోతందంటూ మీడియా ప్రచారం చేస్తే లేదు నేను పెళ్లి చేసుకోవడం లేదు.. స్నేహితురాలి పెళ్లి కోసం షాపింగ్ చేస్తున్న అని చెప్పిన హీరోయిన్ శ్రియ అబద్ధం చెప్పేసిందని తెలిసిపోయింది. మీడియాను తప్పుదోవ పట్టించి మీడియా చెప్పిందే నిజమైంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో దక్షిణాది సినీ పరిశ్రమలో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రియ శరణ్ చివరకు పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడు రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్‌ను మార్చి 12వ తేదీన వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ‘మిడ్ డే’ టాబ్లాయిడ్ ఓ కథనం ప్రచురించింది. అంథేరిలోని శ్రియ నివాసంలోనే ఆండ్రీతో ఆమె వివాహం సంప్రదాయబద్ధంగా జరిగిపోయిందంట.
అయితే ఈ పెళ్లికి తన సన్నిహిత మిత్రులతో పాటు శ్రియ ఇంటికి పక్కనే ఉన్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఆయన భార్య షబానా మాత్రమే హాజరైనట్లు సమాచారం. పెళ్లికి ముందు రోజు మార్చి 11వ తేదీన అతిథులకు మాంచి విందు ఏర్పాటుచేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆండ్రీ-శ్రియ ఇద్దరూ పెళ్లి ప్రమాణాలు చేశారు. శ్రియ గులాబీ రంగు దుస్తులు ధరించి ది. పెళ్లి తర్వాత ఉదయ్‌పూర్‌లో వివాహ తదుపరి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
