- Advertisement -
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైసీపీ ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం విషయంలో ముందుకే వెళ్లాలన్ననిర్ణయంతో ఉన్నట్టు ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి తెలిపారు. ఈ అంశంపై ఎక్కువ రోజుల పాటు చర్చ జరిగేలా చేసి జాతి దృష్టికి వాస్తవాలను తీసుకెళ్లేలా చేయడమే తమ లక్ష్యమని పార్థసారధి తెలిపారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించేలా మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచాలనే వ్యూహం కూడా ఉందన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ముందుగా వైసీపీ నిర్ణయించిన విషయం విదితమే. ఈ విషయంలో వైసీపీకి మద్దతిచ్చే ఉద్దేశ్యం లేక టీడీపీ సొంతంగానే అవిశ్వాస తీర్మానంపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.