2014 తర్వాత నుంచీ సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు పూర్తిగా ముంచాడన్నది నిజం. ఎన్నో అబద్ధపు హామీలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దిమ్మతిరిగే షాకులు ఇచ్చాడు. దానికితోడు బాబు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన రుద్దిన మోడీ కూడా బాబు నడకనే అనుసరించి మరిన్ని కష్టాలు పెంచాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయం పక్కనపెడితే బాబు దెబ్బకు బలైపోయిన రాజకీయ నాయకులు లిస్ట్ మాత్రం ఈ సారి చాలా ఉంది. ఎమ్మెల్యే అవకముందు మద్దతు ఇచ్చిన నాయకుల నుంచీ మామ ఎన్టీఆర్‌తో సహా ఎంతోమందిని ముంచిన చరిత్ర చంద్రబాబుకు ఉంది.
అయితే ఈ టెర్మ్‌లో మాత్రం పదుల సంఖ్యలో నాయకులను నిండా ముంచాడు చంద్రబాబు. అసెంబ్లీ సీట్లు పెంచే ఒక్క నిర్ణయానికి మోడీ సానుకూలంగా స్పందించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో ప్రయోజనాలకు మంగళం పాడేశాడు చంద్రబాబు. అయితే మోడీ మాత్రం సీట్లు పెంపు నిర్ణయం కుదరదన్నాడు. ఆ షాక్‌తోనే చంద్రబాబు మోడీతో కటీఫ్ అన్నాడు. అయితే సీట్లు పెరగడం ఖాయం అని చంద్రబాబుని నమ్ముకుని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం ఇప్పుడు ఆగమ్యగోచరమయింది. ఈ లిస్టులోనే ఇప్పుడు అరకు ఎంపి కొత్తపల్లి గీత కూడా చేరింది. ముందుగా టిడిపిలోకి జంప్ చేసిన గీత సీటు ఇచ్చి గెలిపించిన వైకాపా అధినేత జగన్‌పై ఓ స్థాయిలో విమర్శలు చేసింది. ఒక సారి జగన్‌కి శతృవు అయిన వెంటనే గీతను పట్టించుకోవడం మానేశాడు చంద్రబాబు. ఆ బాధతో బాబుకు హ్యాండ్ ఇచ్చి బిజెపిలో ట్రై చేసింది. కానీ అక్కడ కూడా పూర్తిగా నిరాదరణే ఎదురయ్యింది. ఆ నేపథ్యంలోనే మహిళలకు అత్యంత ఎక్కువ గౌరవం ఇస్తాం అని చెప్పుకునే నాయకులందరూ ఆ మహిళల విషయంలో అంతర్గతంగా చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది గీత. తనను మనోవ్యాకులతకు గురి చేశారని చెప్పుకొచ్చింది. జగన్‌ని వీడి తప్పుచేశానని వాపోయింది. వైకాపా నుంచి ఫిరాయించానని తనను విమర్శించిన వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలలో ఉన్నారని వ్యాఖ్యానించింది.
వైకాపాలో మళ్ళీ చేరడం కోసం కొత్త పల్లి గీత గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే జగన్ మాత్రం నమ్మడానికి అస్సలు రెడీగా లేడు. అన్నింటికీ మించి అరకు నియోజకవర్గంలో వైకాపా విజయం సాధించడం నల్లేరుపై నడక లాంటిది. అందుకే నమ్మకద్రోహులకంటే నమ్మకస్తులైన కొత్తవాళ్ళకు సీటు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు జగన్. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు అన్ని దార్లూ మూసుకుపోయిన మహిళా ఎంపీ మాత్రం కొత్త పార్టీ పెట్టుకుంటా…….స్వతంత్రంగా అయినా పోటీ చేస్తా……బాబును నమ్మి చెడిన నాకు వేరే ప్రత్యామ్నాయం ఏముంది అని వాపోతోంది. కొత్తపల్లి గీత పరిస్థితి చూస్తున్న టిడిపి నాయకులు కూడా బాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంతర్గతంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. ఎంతైనా…….వాడుకుని వదిలేయడంలో సూపర్ ఎక్స్‌పర్ట్ కదా.