- Advertisement -
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‍లో వస్తున్న సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చెయ్యడానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. డిసెంబర్ చివరి వారంలో ఆడియోను రిలీజ్ చేస్తున్నారు. సుకుమార్ ఎన్టీఆర్‍ను ఈ సినిమాలో చాలా అద్భతంగా చూపించారట.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇంక ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితర నటులు నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ రచ్చ రచ్చ చేయనున్నాడు.