Monday, May 12, 2025
- Advertisement -

పవన్ పేరు బాగానే వాడుతున్నారుగా…

- Advertisement -

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ జపిస్తున్న పేరు. ఈ పేరు వింటే ఆయన అభిమానుల్లో ఓ రకమైన పూనకం వచ్చేస్తుంది. చేసింది… చేస్తున్నది తక్కువ సినిమాలే అయినప్పటికీ… 

పవన్ అంటే అభిమానుల్లో అమితమైన ఇష్టం… ఇప్పుడు అదే ఇష్టాన్ని చిత్ర పరిశ్రమలో పలువురు క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనటం లో సందేహం లేదు. మొన్న శంకరాభరణం చిత్రానికి హైప్ తెచ్చేందుకు పవన్ చేత కోన వెంకట్ ఆ చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేయించగా, తాజాగా బెంగాల్ టైగర్ చిత్ర బృందం ఏకంగా తన సొంత ఇమేజ్ నే నమ్ముకున్న మాస్ మహారాజ్ రవితేజ చేత సైతం పవన్ పేరును ఉచ్చరింప జేశారు. 

‘సౌత్ ఇండియాలో రజనీకాంత్ కన్నా గొప్ప స్టార్ పుట్టడని అనుకున్నాం.. ఇప్పుడు పవన్ కల్యాణ్ రాలేదా? పవన్ మొన్న ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే జనం ఓట్లు గుద్దార’ని  డైలాగ్ లు చెప్పించారు. మొత్తం మీద చూస్తే తెలుగు ఇండస్ట్రీలో పవన్ పేరును బాగానే వాడుతున్నారుగా… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -