Sunday, May 11, 2025
- Advertisement -

రివర్స్ జంపింగ్స్ః విశాఖలో టిడిపికి ఎదరుదెబ్బ…. పార్టీకి గుడ్ బై చెప్పిన మహిళా నాయకురాలు

- Advertisement -

నాలుగేళ్ళుగా మోడీ దగ్గర పూర్తిగా సాగిలపడిన చంద్రబాబు……ఇప్పుడు ఎంతగా అబద్ధాలతో పొలిటికల్ డ్రామాలు రక్తికట్టిస్తున్నా కూడా 2019లో టిడిపికి గెలుపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎన్నికల ఏడాది మొదలయ్యేసరికి రాజకీయ నాయకుల జంపింగ్ వ్యవహారాలే ఏ పార్టీ బలం ఏంటన్నది తేల్చేస్తూ ఉంటాయి. ఇక బ్యూరాక్రాట్స్ కూడా అధికార పార్టీ ఓడిపోతుందన్న అనుమానం వచ్చిన వెంటనే అధికారంలో ఉన్నవారికి దూరం జరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎపి ప్రభుత్వంలో కూడా చాలా మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు బాబుకు దూరం జరుగుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా విజయసాయికి టచ్‌లోకి వెళ్ళి ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు, అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు అందిస్తున్నారేమోనని బాబు తరచుగా ఆందోళన చెందుతున్నాడు. సిఎం క్యాంప్ ఆఫీసులో ఇద్దరు ఐఎఎస్‌ల సమక్షంలో వైకాపా నుంచి జంప్ చేసి మంత్రి అయిన ఎమ్మెల్యేకు, టిడిపి స్థానిక నాయకుడికి మధ్య అవినీతి, అక్రమాల పంపకాలు ఎలా జరగాలో చంద్రబాబు వివరించి చెప్పిన విషయానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పుడు విజయసాయి దగ్గర ఉన్నాయి. అలాంటి ఆధారాలు ఉన్నతస్థాయి అధికారుల సాయం లేకుండా విజయసాయికి అందే అవకాశం లేదు.

ఇక నాయకుల జంపింగ్స్ కూడా టిడిపిలో ఆందోళన పెంచుతున్నాయి. జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి నియోజక వర్గ ఇన్ ఛార్జ్‌గా ఉన్న నాయకుడు తాజాగా వైకాపాలో చేరారు. కోడెల శివప్రసాద్ రావులాంటి అంగబలం, అర్థబలం బలంగా ఉన్న సీనియర్ నేత నియోజకవర్గంలోనే కీలక నేతలు వైకాపాలో చేరడం బాబుకు టెన్షన్ తెప్పించే వ్యవహారమే. ఇక తాజాగా విశాఖపట్టణం, కేజే పురం ఎంపిటీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ టిడిపికి గుడ్ బై చెప్పేశారు. వైకాపా నుంచి గెలిచిన ఈమె అభివృద్ధి కోసం అని చెప్పి టిడిపిలో చేరారు. అయితే అభివృద్ధి లేకపోగా టిడిపి నాయకులు తనను ఘోరంగా అవమానించారని, హింసించారని చెప్పి ఈ మహిళా నేత ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అన్నకు దూరమై చాలా పెద్ద తప్పు చేశానని అభిమానులతో చెప్పారు. అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని……కనీసం పెన్షన్లు కూడా ఇచ్చని పాపాన పోలేదని టిడిపి ప్రభుత్వం దుమ్మెత్తిపోశారు. టిడిపి నాయకుల అవినీతి కార్యక్రమాలు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేదని బాబు పాలనలోని డొల్లతనాన్ని బయటపెట్టేశారు ఈ మహిళా నాయకురాలు. చివరి నిమిషంలో గంటాలాంటి నేతలు ఈ మహిళా నాయకురాలికి టచ్‌లోకి వెళ్ళినప్పటికీ ఆమె మాత్రం ….మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి రాజీనామాను టిడిపి అధినేత చంద్రబాబుకు పంపించేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -