Saturday, June 1, 2024
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @ రంగస్థలం…. చెర్రీ, సుక్కూలకు బిగ్గెస్ట్ బూస్ట్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన రంగస్థలం సినిమాకు సినిమా ఇండస్ట్రీ జనాల నుంచి మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. ఎన్టీఆర్‌తో సహా ఇండస్ట్రీలో ఉన్న అన్ని క్యాంపుల జనాల నుంచి రంగస్థలంపై ప్రశంశల జల్లు కురుస్తోంది. మరీ ముఖ్యంగా పదేళ్ళ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు…….ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ సినిమాను కూడా సాధించినప్పటికీ నటుడిగా మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్న చరణ్‌కి రంగస్థలం చాలా పెద్ద పేరునే తెచ్చిపెట్టింది.

ఇక తాజాగా ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూశారు. చరణ్, సుకుమార్‌లతో కలిసి సినిమా చూసిన పవన్‌కి సినిమా చాలా బాగా నచ్చిందట. తాను పుట్టి పెరిగిన పరిస్థితులను గుర్తు చేసిందని పవన్ ఆనందం వ్యక్తం చేశాడట. ఆర్య సినిమాను తనతో తీయాలనుకున్న సుకుమార్ గురించి కూడా గొప్పగా చెప్పాడట పవన్ కళ్యాణ్. ఇక అబ్బాయి చరణ్ నటన కూడా పవన్‌ని గొప్పగా మెప్పించిందట. మామూలుగా అయితే పవన్ ఇలాంటి విషయాలకు చాలా దూరం. కానీ ప్రస్తుతం హీరోగా కంటే నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో హిట్ సినిమాలు అందించాలనుకుంటున్న పవన్ ఈ మధ్య తరచుగా సినిమా దర్శకులను, నటులను కలుస్తున్నాడు. చర్చలు చేస్తున్నాడు. త్వరలో చరణ్‌తో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నిర్మించనున్న విషయం తెలిసిందే. రంగస్థలం కథ విషయంలో ప్రేక్షకుల నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం మెప్పిస్తూనే ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంశలు రామ్ చరణ్, సుక్కూలకు మరికాస్త ప్రోత్సాహకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -