40 సంవత్సరాల అనుభవం, నాఅంత సీనియర్ రాజకీయనాయకుడు లేడని బాబు డబ్బాకొట్టుకోవడం ఆయనకు అలవాటే. కాని అన్నేల్ల రాజకీయ అనుభవం ఇప్పుడు పనికి రావడంలేదు. రాజకీయ జీవితంలో ఏన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న బాబు వైసీపీ అధినేత జగన్ రాజకీయ చాణక్యం ముందు ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో బాబు ఎన్ని కుట్ర పన్నాగాలు పన్నినా జగన్ ముందు తేలిపోతున్నాయి. జగన్ వేసే ఎత్తులకు బాబు చిత్తై పోతున్నారు. అందుకు తాజా ఉదాహరనే ఎంపీల రాజీనామాలు.
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే మాపార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఏపీకీ ప్రత్యోకహోదాకోసం ఆ పార్టీ ఎంపీలు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తారని జగన్ చెప్పిన విధంగా ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసి ఆ పత్రాలను స్పీకర్‌కు అందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలసి నడవాలనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు జగన్. మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. చంద్రబాబుకు నేను సవాల్ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించే ధైర్యం నీకుందాని ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే వారిని గెలిపించుకొనే సత్తా 40 సంవత్సరాల అనుభవం ఉన్న బాబుకు లేదా…? అన్ని వ్యవస్థలను మ్యానేజ్ చేసే బాబు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రతిపక్ష పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తె అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీలు ఎందుజంకుతున్నారనేది ప్రశ్న..?
టిడిపి ఎంపిల విషయాన్ని జగన్ ఎన్నిసార్లు ప్రస్తావించినా చంద్రబాబు సవాలుగా ఎందుకు తీసుకోవటం లేదు? ఉపఎన్నికల్లో ఎంపిలను గెలిపించుకోవటమంటే ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించినంత వీజీ కాదన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే ఎంపిల చేత రాజీనామాలు చేయించటానికి వెనకాడుతున్నరన్నది స్పష్టంగా తెలుస్తోంది.
వైసిపి ఎంపిల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేరే విషయం. హోదా డిమాండ్ తో ఎంపిలు రాజీనామాలు చేశారనే మైలేజీ అయితే వైసిపికి వస్తుంది కదా? అటువంటిది అధికారంలో ఉండి కూడా రాజీనామాలు చేయించటానికి చంద్రబాబు వెనకాడుతున్నారంటే కారణం అర్ధమైపోవట్లా బాబు దుస్థితి.