Sunday, April 28, 2024
- Advertisement -

హోదా ఇవ్వలేని ప్రధానికి.. రాష్ట్రం వచ్చే హక్కు ఉందా ?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 11న విశాఖ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఈ సారి ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీతో పాటు జగన్ సర్కార్ కూడా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని పలు ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ప్రారంభించనున్నారు. అయితే అమద్య అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు పెద్దగా హడావిడి లేనప్పటికి.. ఈ సారి మాత్రం ప్రధాని పర్యటనకు నానా హంగామా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎందుకంటే ఈసారి మోడీ విశాఖ వస్తుండడమే దానికి కారణం.

విశాఖ చుట్టూ ఇప్పుడు పలు రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే జగన్ సర్కార్ ప్రతిపాధించిన విశాఖ కేంద్రంగా పరిపాలన.. ఇలా చాలా అంచలు చర్చకు వస్తున్నాయి. అయితే వీటిపై ప్రధాని ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తున్న చర్చ. అయితే ప్రధాని పర్యటనను సిపిఎం వంటి కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని ప్రధాని రాష్ట్రనికి ఎందుకొస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. అందుకే ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా ఈ నెల 10,11 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చాయి.

అలాగే సి‌ఎం జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపించడానికి ఇదే సరైన సమయమని, ఈ అవకాశాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ వాదులు సూచిస్తున్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం ఇప్పటికీ చాలా సార్లు స్పష్టం చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండడంతో ప్రత్యేక హోదా ప్రస్తావనను మళ్ళీ తెరపైకి తెస్తే మోడీ సర్కార్.. హోదా విషయంలో పునఃఆలోచించే అవకాశం ఉండని కొందరి వాదన. అందుకోసం ప్రధాని పర్యటనలో ప్రత్యేక హోదా ప్రస్తావనను జగన్ తీసుకురావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి జగన్ ప్రత్యేక హోదా ప్రస్తావనను తెరపైకి తెస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రజలంటే చిన్నచూపు ఎందుకు జగన్ సార్ !

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

ఏపీలో ఉపఎన్నిక..రాబోతుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -