బాలీవుడ్‌లో సంచలన తార రాధిక ఆప్టే హాలీవుడ్‌కు వెళ్తుంది.ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించనుంది. స్టానా కాటిక్, సారా మేగాన్ లాంటి హాలీవుడ్ తారాలు నటిస్తున్న ఈ సినిమాలో రాధిక బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇప్పటికే చాలామంది తారలు హాలీవుడ్‌లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒక్క ప్రియాంక చోప్రా తప్ప హాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు లేరనే చెప్పాలి. దీపికా పదుకొనే, ఐశ్వర్యా రాయ్ లాంటి వారు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు రాధిక ఆప్టే హాలీవుడ్‌లో అవకాశం వచ్చింది.చూడాలి అమ్మడి అదృష్టం ఎలా ఉండబోతుందో చూద్దాం!
