నాని గత నాలుగు సినిమాలను పరిశిలిస్తే రోటిన్‌గా ఉన్నట్లు ఉంటున్నాయి. నాని అభిమానులు కూడా ఇదే అనుకుంటున్నారు.నాని నుంచి కొత్తదనం కొరుకుంటున్నారు ప్రేక్షకులు.సినిమాలు హిట్ అవుతున్నప్పటీకి నాని యాక్టింగ్లొ కొత్తదనం మిస్ అయ్యింది. అందుకే నాని సరికొత్త కాంబినేషన్‌కు తెరలేపాడు.నాని ఇంతవరకు లవ్ స్టోరీస్ తప్ప ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎప్పుడూ చేయలేదు.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు హీరో నాని. విక్రమ్ సినిమాలను పరిశీలిస్తే వైవిధ్యనికి పెద్ద పీట వేస్తారు.
హారర్ సినిమా చేయనని, కాస్త థ్రిల్ అనిపించే సబ్జెక్ట్ దొరికితే మాత్రం చేస్తానని గతంలోనే ప్రకటించాడు నాని. చెప్పినట్టుగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్ కు ఓకే చెప్పాడు.ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు నాని. ఈ సినిమా తర్వాత సెట్స్ పైకి వచ్చేది విక్రమ్ కుమార్ సినిమానే.కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయాలి. కానీ కిషోర్ తిరుమల స్థానంలో విక్రమ్ కుమార్ వచ్చి చేరాడు.