Wednesday, May 15, 2024
- Advertisement -

మంత్రి ఆది కుటుంబంలో విబేధాలు..

- Advertisement -

ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ముందుగా అందరి నోటా వ‌చ్చేది బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ తర్వాత ఆదినారాయణ రెడ్డి…జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివి పాపులర్ అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం జగన్ ని విమర్శించి పాపులర్ అయ్యారు…అదే విమర్శల కోటాలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు…దళితులను విమర్శించి మరింత విమ‌ర్శ‌ల పాల‌య్యారు…

జమ్మలమడుగులో రాజకీయం ఎప్పుడు వేడి వేడిగా ఉంటుంది..టీడీపీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి వర్గానికి, ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. .2014 ఎన్నికలలో కూడా ఇదే తంతు…టీడీపీ నుండి రామసుబ్బా రెడ్డి పోటీ చేస్తే వైసీపీ నుండి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు…ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆదినారాయ‌ణ రెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. రామ‌సుబ్బారెడ్డి, ఆది మ‌ధ్య ఉన్న విబేధాలు టీడీపీ అధినేత జోక్యంతో ఇద్దరూ కలిసిపోయి చెరో అర్ధ‌రూపాయి వాటా తీసుకుంటున్నారు.

ఆదినారాయ‌ణ రెడ్డికి ఎవరూ ఊహించని విధంగా ఇంటి నుండి పోరు మొదలైందని సమాచారం… ఆ వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నారా? స్వయానా ఆది అన్న చదిపిరాళ్ల నారాయణ రెడ్డి తనయుడు భూపేష్‌ను తో పోరు మొదలైందంటూ వార్తలు వస్తున్నాయి…గతంలో ఆదినారాయణ రెడ్డి తన రాజకీయ వారసుడిగా అన్న చదిపిరాళ్ల నారాయణ రెడ్డి తనయుడిని ప్రకటించారట…అందుకే ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించాలని అడుగుతున్నారట. మంత్రి అయిన త‌ర్వాత అన్న కొడుకు భూపేస్‌ను దూరంపెడుతూ వ‌చ్చారు.

తన కుమారుడు సుధీర్‌రెడ్డిని రాజ‌కీయ వారుసుడిగా ప్ర‌క‌టించాల‌ని చూస్తున్నారు. సుధీర్‌రెడ్డికి జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకునే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఈ విషయంలో తన చిరకాల ప్రత్యర్థి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గం నుంచి అవరోధాలు ఎదురైనప్పటికి పట్టుబట్టి మరి తన కుమారుడు సుధీర్‌రెడ్డికి పదవి ఇప్పించుకోగలిగారు.

ఈ నేపథ్యంలో అంతర్గతంగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్న అన్నదమ్ములు కొంతలంగా మంత్రి కార్యక్రమాలకు హాజరు కావడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -