పవన్‌కి సూపర్ షాక్ః గన్‌మెన్స్‌తో పవన్‌పై చంద్రబాబు గూఢచర్యం చేశాడా?

చంద్రబాబు రాజకీయం గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? పదవి కోసం ఎంతకైనా దిగజారగలడు….ఎవ్వరినైనా మోసం చేయగలడు. ఇప్పుడు అలాంటి ఒక కుట్రను పసిగట్టిన పవన్ కళ్యాణ్ బాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆ మధ్య తనకు సెక్యూరిటీ కల్పించమని పవన్ కళ్యాణే చంద్రబాబు ప్రభుత్వాన్ని అడిగాడు. ఆ వెంటనే చంద్రబాబు పవన్‌కి సెక్యూరిటీ కల్పించాడు.

అయితే తాజాగా పవన్‌కి చంద్రబాబు అంత ఫాస్ట్‌గా సెక్యూరిటీ కల్పించడం వెనుక అసలు మర్మం అర్థమైంది. పవన్‌కి సెక్యూరిటీ ఇవ్వడం విషయం ఎలా ఉన్నా పవన్ ప్రతి అడుగును, పవన్ రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టి చంద్రబాబు ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందించడమే పనిగా పెట్టుకున్నారు పవన్ సెక్యూరిటీ సిబ్బంది. ఆ రకంగా పవన్ రాజకీయాలు, రాజకీయ వ్యూహాలన్నీ కూడా చంద్రబాబుకు ముందే తెలిసిపోతున్నాయి. పార్టీలో ఎవరైనా చంద్రబాబు మనుషులున్నారా అని మొదట్లో అనుమానించాడు పవన్. అయితే రీసెంట్‌గా బెజవాడ్ వాక్‌లో తాను పాల్గొనే వ్యూహం గురించి ముందుగా సెక్యూరిటీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు పవన్. దాంతో పవన్‌కి తన వ్యూహాల గురించి చంద్రబాబుకు తెలియచేస్తున్నది ఎవరో వెంటనే అర్థమైపోయింది. అలాగే చంద్రబాబు కుట్ర రాజకీయాలు కూడా తెలిసొచ్చాయి. చంద్రబాబు కుట్ర రాజకీయాల దెబ్బకు షాక్‌తిన్న ఆ వెంటనే బాబుకు కౌంటర్ కూడా ఇవ్వాలనుకున్నాడు. అందుకే తన సెక్యూరిటీ సిబ్బందని వెనక్కి పంపించేశాడు పవన్. ఇక నుంచీ పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీపైన ఆధారపడాలనుకుంటున్నాడు. ఏది ఏమైనా పవన్‌కి సెక్యూరిటీ పేరుతో చంద్రబాబు రచించిన కుట్ర రాజకీయం వ్యవహారం మాత్రం ఇప్పుడు జనసేన పార్టీలో హాట్ టాపిక్ అయింది.