నిర్మాత‌గా మారుతున్న హీరోయిన్ స‌దా

హీరోయిన్ స‌దా తెలుగు చాలా సినిమాలు చేసిన అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.త‌మిళ్‌లో కూడా అగ్ర హీర‌ల ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది. సదాకు చాలా గ్యాప్‌ తరువాత ఒక కోలీవుడ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. టార్చ్‌లైట్‌ అనే చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపేసింది. టార్చ్‌లైట్‌ సదా కెరీర్‌లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఈ దర్శకుడి ప్రతిభను మెచ్చి నటి సదా ఆయన దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి సిద్ధం అయ్యారట. అగ్రనటిగా వెలుగొందుతున్న నయనతార కూడా ఆరమ్‌ కథ తనను బాగా ఆకట్టకోవడంతో ఆ చిత్రాన్ని తనే నిర్మించారన్నది గమనార్హం. ఇప్పుడు నయన్‌ బాటలోనే నటి సదా పయనించడానికి సిద్ధం అవుతోందన్న మాట.