Friday, May 10, 2024
- Advertisement -

మ‌హేష్ బాబుకు ఇష్ట‌మైన సీఎం ఎవ‌రో తెలుసా!

- Advertisement -

సూప‌ర్ స్టార్ ప్రీన్స్ మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని రేపు(20)విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.ఈ చిత్రంలో మ‌హేష్ ముఖ్యమంత్రిగా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌ల అయిన ట్రైల‌ర్‌, సాంగ్ టీజ‌ర్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.మహేశ్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు మ‌హేష్ బాబు. ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో భాగంగా మీడియా వర్గాలకు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్ ముందుకు ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న వచ్చింది. భరత్‌లో మహేశ్ సీఎం పాత్రను చేశాడని వేరే చెప్పనక్కర్లేదు.

ఈ నేపథ్యంలో మీకు ఇష్టమైన సీఎం ఎవరు? అనే ప్రశ్నకు ఆసక్తిదాయకమైన రీతిలో సమాధానం ఇచ్చాడు ఈ హీరో. ‘నేనసలే టెన్షన్లో ఉంటే, నన్ను ఇలాంటప్పుడు కాంట్రవర్సీలోకి లాగుదామని చూస్తున్నారా..?’ అని అంటూ నవ్వుతూ ఎదురు ప్రశ్నించాడు మహేశ్ బాబు. పొలిటిక్స్‌కు చాలా దూరంగా ఉన్న‌ప్ప‌టికి మ‌హేష్ బాబుని రాజకీయాల‌లోకి లాగ‌డానికి ప‌లు పార్టీలు చాలా ప్ర‌యత్నాలే చేశాయి, కాని మ‌హేష్ రాజకీయాలుకు దూరంగా ఉంటున్నాడు.రేపు విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హించారు.బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -