యాంకర్ అనసూయ బుల్లితెర నుండి వెండితెరకు వెళ్లిన సంగతి తెలిసిందే.క్షణం సినిమాతో తనలోని నటనను సీని అభిమానలకు పరిచియం చేసింది.ఇక తాజా హిట్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో రాంచరణ్ తరువాత అనసూయకే ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది. పల్లెటూరి మహిళగా అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రంగమ్మత్తకు సంబంధించిన ఓ సీన్ ను ఆడిషన్స్ లో భాగంగా అనసూయపై చిత్రీకరించగా, తాజాగా ఆ వీడియోను అనసూయ తన అభిమానులతో పంచుకుంది.
ఆడిషన్ లో భాగంగా సీన్ తీసినప్పటికీ, అందులోనూ అనసూయ ఇరగదీసిందని ఈ వీడియో చూసిన అభిమానులు అంటున్నారు. రంగస్థలం సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది.ఈ సినిమాలో హీరోయిన్‌గా జమంత చేసింది.సుకుమార్ డైరక్షన్‌లో మార్చి 30న ఈ సినిమా విడుదల అయింది.
https://youtu.be/9knAYg3VIN4