- Advertisement -

మహేష్ కోసం కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న సుకుమార్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ అంటే అంతే. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏ రేంజ్ హిట్ ఇచ్చాం అనే విషయంపైనే రెమ్యూనరేషన్స్ డిసైడ్ అవుతూ ఉంటాయి. టాలెంట్ కూడా ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సుకుమార్ అదే ఫేజ్‌లో ఉన్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా ముందు వరకూ కూడా స్టార్ హీరోస్‌తో హిట్ ఇవ్వలేకపోయాడు సుకుమార్. అయితే నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ లోటు తీర్చేశాడు. ఇక రంగస్థలం సినిమాతో కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క డైరెక్టర్‌తో పోల్చుకున్నా…….అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది సుకుమార్ ప్రతిభ. అయితేనేం కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ లేకపోవడంతో రెమ్యూనరేషన్ మాత్రం మీడియం రేంజ్‌లో ఉండేవి.

అయితే రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత టెర్మ్స్ అన్నీ మారిపోయాయని తెలుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో సుకుమార్ టైం నడుస్తోంది. అందుకే అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు సుకుమార్ వెంట పడ్డారు. అయితే సుకుమార్ మాత్రం ఫైనల్‌గా మహేష్‌కి కమిట్ అయ్యాడు. అలాగే సుకుమార్ తర్వాత సినిమాను నిర్మించడానికి చాలా మంది నిర్మాతలే వెంట పడ్డారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రం ఏకంగా 18 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. అలాగే మొత్తం రెమ్యూనరేషన్‌ని మూడు పర్యాయాల్లో ఇచ్చేలాగా ఒప్పందం చేసుకుని ముందుగా ఆరు కోట్ల అడ్వాన్స్ ఇచ్చారట. ఇంచుమించుగా ఈ మొత్తం రంగస్థలం సినిమాకి సుకుమార్ తీసుకున్న రెమ్యూనరేషన్‌తో సమానం. ముందు సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ అంత మొత్తాన్ని తర్వాత సినిమాకు కేవలం అడ్వాన్స్‌గా అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి సుకుమార్ మహేష్‌తో సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేశాడంటే మాత్రం టాప్ సీటులోకి వెళ్ళిపోతడనడంలో సందేహం లేదు అన్నది క్రిటిక్స్ మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -