తెలుగు లో అంత తేలిగ్గా అర్ధం అయిపోయే సినిమాలు తీయడం సుకుమార్ నైజం కాదు. అతను తీసే ప్రతీ సినిమాలో ఎదో ఒక వింత, కొత్త , వినూత్న పంథా దాగి ఉంటుంది. తన క్యారెక్టర్ ల పెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్ లో చేయిస్తాడు సుకుమారుడు. అలాంటి సుకుమార్ కి ఎన్టీఆర్ లాంటి సూపర్ హీరో దొరికితే ఎలా ఉంటుంది ? అచ్చం ‘నాన్నకు ప్రేమతో’ లాగా ఉంటుంది.
తన తండ్రి ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) చివరి కోరిక తీర్చడం కోసం ఎన్టీఆర్(అభి రాం) ముందుగా రకుల్ ప్రీత్‌సింగ్(దివ్యంక) తో పరిచయం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఆమె తండ్రి అయిన జగపతిబాబుకు దగ్గరయ్యి అతని కంపెనీ నీ అతని స్థాయినీ కిందకి దించడమే లక్ష్యంగా పని చేస్తాడు . ఆ కంపెనీని ఎవరికీ అందనంత ఎత్తుకి తీసుకుని వెళ్ళిన జగపతి బాబు కి ఇదంతా ఆశ్చర్యకరంగా ఉంటుంది . అంత సవ్యంగా సాగుతున్న నేపథ్యంలో జగపతి బాబు కి ఓ నిజం తెలుస్తుంది. తను మోసం చేసిన రాజేంద్ర ప్రసాద్ కొడుకు ఎన్టీఆర్ తనమీద రివెంజ్ కోసం వచ్చాడు అనేది అతను తెలుసుకునే విషయం దాన్ని ఛేదించే క్రమంలో విలన్ల గొడవపడతారు . దానికి ముందర దశలో హీరోయిన్ రకుల్ ని కిడ్నాప్ చేస్తారు . ఆమెను ఆ ప్రమాదం నుంచి కాపాడిన ఎన్టీఆర్‌కు ఆమెకి దగ్గర అవడానికి ఈ కిడ్నాప్ ని వాడుకుంటాడు . అప్పుడు ఎన్టీఆర్ జగపతి బాబు కంపెనీ వాటి వెనుకున్న రహస్యాల్ని ఎలా ఛేదిస్తాడు? తనకు తెలియకుండా ఓ స్థాయికి తీసుకెళ్ళిన జగపతిబాబుని కిందకి ఎలా దించుతాడు? ఇంతకీ రాజేంద్రప్రసాద్ చివరి కోరిక ఏంటి? అనే విషయాలు తెలియాలంటే.. సినిమా చూసే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.
ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హై లైట్ అని ప్రత్యేకంగా చెప్పన్నకర లేదు. కానీ సుకుమార్ రాసిన క్యారెక్టర్ ని ఎన్టీఆర్ ప్లే చేసిన విధానం గురించి ఖచ్చితంగా చెప్పి తీరాలి. మైండ్ సెట్ తో అన్నిటినీ నడిపించే ‘అభిరాం’ పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు, సుకుమార్ అనుకున్న పాత్రకి తగ్గట్టుగానే చాలా పర్ఫెక్ట్ గా చేసిన ఎన్టీఆర్ అందులో తనవంతు న్యాయం చేసాడు. మైండ్ గేమ్ ఆడుతూ ముందుకు సాగడం, తన ప్రేయసిని కూడా వలలో వేసుకోవడంలో భాగంగా దీన్ని వాడడం లాంటివి ఈ పాత్రకి సరిగ్గా నప్పెసాయి. ఎన్టీఆర్ నటన స్థాయి అద్భుతం అనిపించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచీ సొంత డబ్బింగ్ వరకూ అన్ని విషయాల్లోనూ ఆకట్టుకుంది. సుకుమార్ నడిపించిన స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కిడ్నాప్ అయిన సీన్ లో ఆమెని బయటకి తెచ్చే సన్నివేశం, జగపతి బాబుతో గేమ్ గురించి చెప్పే సన్నివేశం అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి.
ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా అమేజింగ్ గా ఊహించినా అక్కడ సరైన ట్విస్ట్ పడలేదు, సెకండ్ హాఫ్ చాలా డుల్ గా స్టార్ట్ అయ్యింది. ఏం తీయాలో తెలీదు అన్నట్టు హీరోయిన్ తో సోది సీన్ లు తీస్తూ సినిమా లాగించారు , సినిమా అంతా మైండ్ గేమ్ మీద సాగుతూనే అవసరమైన చోట లాజిక్ లు మిస్ అయ్యారు. బీ సీ సెంటర్ ప్రేక్షకులకి మినిమం కూడా అర్ధం కాని ఇంగ్లీష్ నీ ఫిజిక్స్ నీ విచ్చలవిడిగా వాడేసాడు సుకుమారుడు. రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతా మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కామెడీ ఒక్క శాతం కూడా ఎక్కడా లేదు. మొదట్లో రేకెత్తించిన ఆసక్తి, ఫస్ట్ హాఫ్ లో సాగిన పేస్, ఫోర్స్ సెకండ్ హాఫ్ లో ఏ కోశానా కనపడలేదు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే క్లైమాక్స్ కూడా సాగాలి అన్నటు సాగింది.
మొత్తంగా .. ఈ సంక్రాంతికి ఒక లాజికల్ సినిమా గా ఎన్టీఆర్ – నాన్నకు ప్రేమతో ఖచ్చితంగా నిలుస్తుంది. అయితే ఎన్నాళ్ళు ఈ సినిమా రన్ ఉంటుంది అనేది సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వరసగా సినిమాలు ఉండడం తో వాటిని అధిగామించాల్సిన అవసరం ఉంది కూడా. చాలా అద్భుతమైన, లాజికల్ గ్రిప్ తో సినిమాని ఎత్తుకున్న సుకుమార్ సినిమా పూర్తి అయ్యే సరికి కాస్త గతి తప్పాడు, కొందరికి కాస్త తప్పాడు అనిపిస్తుంది ఇంకొందరికి చాలానే తప్పాడు అనిపిస్తుంది. బ్రిల్లియంట్ గా సాగిన మైండ్ గేమ్ – చక్కటి లాజికల్ పంథా – ఆసక్తికర థియరీ – తెలివిగల ఈక్వేషన్ లూ – అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇవన్నీ చివరికి సినిమా ని నిలబెట్టాయి. ఎన్టీఆర్ నటన – సుకుమార్ స్క్రీన్ ప్లే కోసం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కమర్షియల్ గా విపరీతమైన హిట్ అవ్వకపోయినా మంచి రెవెన్యూ చేస్తుంది. స్క్రిప్ట్ లో అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా పాడేది.
