- Advertisement -
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ సినిమా మంచి స్పందనతో దూసుకపోతుంది. ఎన్టీఆర్ స్టైలీష్ లుక్, సుకుమార్ డైరేక్షన్ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. అయితే సినిమా బాగుంది నాన్నకు ప్రేమతో టీం అందరు బాగున్నారు.
ఎలాంటి సంబంధం లేని రామ్ చరణ్ బాద పడుతున్నాడు. ఎందుకు అంటే నాన్నకు ప్రేమతో చిత్రంలో కొన్ని సన్నివేశాలు త్వరలో రామ్ చరణ్ నటించబోతున్న తని ఒరువన్ రీమేక్ లోని సన్నివేశాలు కాపీ చేసారు అని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఆ కాపీ చేసిన సన్నివేశాలు తని ఒరువన్ లో చాలా ముఖ్యమైనవట.
ఆ సిన్స్ లేకపోతే ఎలా సినిమా తీయడం అని చెర్రీ బాదపడుతున్నాడట. మరి ఈ సమస్యపై చరణ్ ఏం చేస్తాడొ చూడాలి. ఇటు చెర్రిని డైరేక్ట్ చేయబోయే సురేంద్ర రెడ్డికి కూడా ఏం చేయలో తెలియట్లేదట. మరి ఈ సమస్య పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.