సంక్రాంతి బరి లో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రం సంచలనం సృష్టిస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని స్టైలీష్ లుక్ లో సుకుమార్ చూపించి సంక్రాంతికి హిట్ కొట్టారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.
ఐతే ఈ సినిమా ఇప్పుడు రికార్డులు సృష్టిస్తుంది. బాహుబలి సినిమాని ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. కాని నాన్నకు ప్రేమతో సినిమా బ్రేక్ చేసింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే కొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ చిత్రం ఏపీ & నైజాం లో కలిపి మొదటి రోజే రూ.13 కోట్లను వసూలు సాధించి రికార్డ్ సృష్టించింది.
ఈ సినిమా యూఎస్ఏ లో మంగళవారం రోజున 73 లోకేషన్స్ లో $346,056 ని వసూలు రాబట్టింది. ఇంకో వారం రోజులో $ 1 మిలియన్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రికార్డ్‌లు చూసి నాన్నకు ప్రేమతో టీం ఫుల్ ఖుషిగా ఉంది.
