రాంచరణ్ రంగస్థలం సినిమా చిత్ర నిర్మాతలుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.మార్చి 30న విడుదలైన ఈ సినిమా హంగామా ఇంకా కొనసాగుతునే ఉంది. ఈ సినిమా రాంచరణ్ కెరీర్‌లో భారీ హిట్టుగా నిలిచింది.మగధీర తరువాత ఆ రేంజ్ హిట్ లేని రాంచరణ్ ఇంత కాలానికి మరో బ్లాక్‌బ్లాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.1980 సంవత్సరానికి సంబందించిన పల్లెటూరు కథగా సినిమా రూపొదించారు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా, 120 కోట్ల షేర్ ను రాబట్టింది.
నైజామ్ ఏరియాలో 18 కోట్లకు అమ్ముడు కాగా, 34 రోజుల్లో 27 కోట్లను వసూలు చేసింది. సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా అంతే సమయంలో 17 కోట్లను రాబట్టింది. ఉత్తరాంధ్రలో 8 కోట్లకి పోయిన ఈ సినిమా,12.08 కోట్ల షేర్ ను తెచ్చిపెట్టింది. ఓవర్సీస్ రైట్స్ 9 కోట్లకి పోగా 16.5 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా సమంత చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.