కర్నాటక రాజకీయం మరో మలుపు తిరింగింది. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఆ రాష్ట్ర కొత్త సీఎం యడ్యూరప్ప బలనిరూపణ తంతు ఇంకా పూర్తికాకముందే ఓ ఆంగ్లో ఇండియన్‌ను అసెంబ్లీకి నామినేట్ చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్ భగ్గు మన్నాయ్.
మొన్నటి ఎన్నికలు 222 స్థానాలకు జరగగా మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా నామినేట్ చేసిన ఆంగ్లో ఇండియన్‌తో కలిపి కర్ణాటక అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరగనుంది. గవర్నర్ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్-జేడీఎస్‌లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అసెంబ్లీకి వినీషా నెరో అనే ఆంగ్లో ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేశారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, బల పరీక్ష పూర్తయ్యేదాకా అది చెల్లకుండా ఆదేశాలివ్వాలని కోరాయి. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్ నామినేట్ పిటిషన్‌తో కలిపి ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.