హరితేజ బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయింది.మహనటి సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లిన హరిప్రియకు ఘోర అవమానం జరిగిందని, ఆమె స్వయంగా ఓ సెల్ఫీ రూపంలో ఓ వీడియో విడుదల చేసింది.సినిమాకి ఫ్యామిలీతో కలిసి వెళ్లిన హరితేజ..మహానటి’ సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ చెల్లి పక్కన కూర్చింది.సినిమా ఇంటర్వెల్‌లో వాళ్ల అమ్మ పక్కన కుర్చొవటానికి సీటు మారేందకు వెళ్లింది.ఆ సీటులో ఉన్న మహిళను తన సీటులో కుర్చొవాలని కోరింది.దీంతో ఆ మహిళ అతని పక్కన మా అమ్మాయి కూర్చొలేదని అభ్యంతరం వ్యక్తం చేసిందట.
దానికి తండ్రిలాంటి ఆయన పక్కన కూర్చొవడం వల్ల ఇబ్బంది ఏమిటని ప్రశ్నించానని చెప్పింది హరితేజ. దానికామె ‘మీరంటే సినిమా వాళ్లు ఎవరి పక్కనైనా కూర్చుంటారు…’ అని అవమానకరంగా చులకన చేసి మాట్లాడిందని చెప్పింది హరితేజ. నటీమణుల గురించి చులకనగా మాట్లాడిన ఆ మహిళతో చాలాసేపు వాదించానని,మగవాళ్ల పక్కన కూర్చొని సినిమా చూడం అనుకుంటే థియేటర్ మొత్తం కొనుక్కోపోయారా, మహిళలకి వేసే స్పెషల్ షోకి రాకపోయారా అని నిలదీశానని చెప్పింది.వీడియో మొదలైనప్పటి నుంచి హరితేజ ఏడుస్తూనే కనిపించింది.