Saturday, May 10, 2025
- Advertisement -

పోరాట‌యాత్ర సీఎం ప‌ద‌వికోస‌మేనా….?

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఇప్పుడు అస‌లు సిస‌లైన రాజ‌కీయ నాయ‌కుడుగా మారుతున్నారు. గ‌తంలోఉన్న ప‌వ‌న్ వేరు …ఇప్పుడున్న ప‌వ‌న్ వేరు. పూర్తి చంద్ర‌ముఖిలా మారిపోయిన జ్యోతిక‌లాగా ప‌వ‌న్ ఇప్పుడు పూర్తి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోయారు. జ‌న‌సేన పార్టీ పెట్టిన‌పుడు ప్ర‌జాసేవే అని చెప్పిన జ‌న‌సేనుడి మ‌న‌సు సీఎం కుర్చీ వైపు మ‌ల్లింది.

అస‌లు విష‌యానికి వ‌ద్దాం..! రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారు ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకోవాల‌నేది అంద‌రికీ తెల‌సిందే. పార్టీ పెట్టిన వెంట‌నే సీఎం కావాల‌ని క‌ల‌లు కంటుంటారు. కొద్దిరోజుల క్రిక‌తం అధికారంలేక‌పోయినా ప్ర‌తిప‌క్షం అద్భుతాలు సృష్టించ‌వ‌చ్చ‌ని వైసీపీనీ టార్గెట్ చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చాలంటే అధికారం అవ‌స‌రంలేదు చిత్త‌శుద్ధిఉటే చాల‌ని ఢంకాబ‌జాయించి డ‌ప్పులు వేశారు. ఇదంతా అభిమానుల‌ను సంతోష పెట్ట‌డానికే అన్న సంగ‌తి తెల‌సిందె.

వైసీపీ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తీరుస్తామ‌ని పాదాయ‌త్ర‌లో జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. అయితే ప‌వ‌న్ ఎన్నోసార్లు విమ‌ర్శులు గుప్పించారు. నాలుగు సంత్స‌రాలుగా బాబుతో అంట‌కాగి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత డోస్ బాగానే పెంచుతున్నారు.

తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలా…? ఏం అనుభ‌వం ఉంద‌ని సీఎంలు కావాల‌నుకుంటున్నారంటూ ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. అధికారంపై నాకు ఆశ లేదు. ముఖ్యమంత్రి కావాలని లేదు’ అంటూ వైరాగ్యపు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. క‌ట్ చేస్తే సీన్ పూర్తిగా మారిపోయింది. వైరాగ్యం నుంచి సీఎం ప‌ద‌విపై క‌న్ను ప‌డింది. న‌న్ను సీఎంను చేస్తే మీస‌మ‌స్య‌లు తీరుస్తానంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నారు.

గ‌తంలో తన బలమెంతో తనకు తెలియదన్న పవన్ ….మ‌రోసారి జ‌న‌సేన బ‌లం ఎక్క‌డ ఉంటే అక్క‌డ మాత్ర‌మే పోటీ చేస్తాన‌ని చెప్పి ….ఇప్పుడు మాత్రం 175 సీట్ల‌లో పోటీ చేసి అన్ని సీట్లు గెలుస్తాన‌ని ఛాలెంజ్ చేశాడు జ‌న‌సేనుడు. పటిష్టమైన పార్టీ నిర్మాణమున్న టీడీపీ, వైకాపాలకే నూటికి నూరు శాతం సీట్లు గెలుస్తామని చెప్పుకునే స‌హాసం చేయ‌డంలేదు . వాళ్లకే ఎన్ని సీట్లొస్తాయో నమ్మకం లేనప్పుడు మొత్తం సీట్లు సాధిస్తానని ఈయన చెప్పుకోవడం చూస్తే ప‌వ‌న్ అత్యాశ‌కు ప‌రాకాస్టే అవుతుంది.

పార్టీ నిర్మానం ప‌రంగా చూసుకుంటే కొద్ది అధికార ప్ర‌తినిధులు త‌ప్ప రాష్ట్రంలో ఎక్క‌డా పార్టీ నిర్మానం లేదు. యాత్ర ప్రారంభించడంతోనే ముఖ్యమంత్రి కోరికను వెల్లడించాడు. పార్టీ సంస్థాగ‌త నిర్మానం లేక‌పోయినా 175 సీట్లు గెలుస్తామ‌ని ప‌వ‌న్ ఏ లెక్క‌న చెబుతున్నారో ఆయ‌న‌కే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -