మెగా ఫామిలీ నుంచి ఫస్ట్ హీరోయిన్ గా బయటకి వచ్చిన నిహారిక కొణిదెల కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉండడం విశేషం. ఒక పెద్ద ఫామిలీ నుంచి అరంగేట్రం అంటే నానా హడావిడీ ఉంటుంది కానీ నాగబాబు కొడుకు, కూతురు మాత్రం ఎక్కడా ఆ హడావిడి లేకుండా సైలెంట్ గా రచ్చ చేస్తున్నారు.
టాలెంట్ ఉన్నవారుగా కూడా మంచి పేరు కొట్టేస్తున్నారు ఇద్దరూ.మరీ ముఖ్యంగా నిహారిక అయితే పెద్ద పెద్ద బడ్జేట్టూ , కళ్ళు చెదిరే హడావిడి కి ఈమె బ్రేక్ కొట్టేసింది . సింపుల్ గా ఒక వెబ్ సీరీస్ తో జనాలకి పరిచయం అయ్యి వారి నుంచి అనూహ్య స్పందన పొందుతోంది ఆమె. ఒకటి రెండు రియాలిటీ షో లతో ఆంధ్ర వ్యాప్తంగా ఆమె సూపర్ పాపులర్ అయిపొయింది. హీరోయిన్ అవ్వాలనే ఆమె తపన ని ఈ రకంగా నేరవేర్చు కుంటోంది నిహారిక.
కాజల్ – చైతు – లక్ష్మి మంచు – నాని – వరుణ్ తేజ్ సహా అనేక మంది టాలీవుడ్ తారలు చేసిన ప్రచారం కూడా ఈమెకు , ఈమె సీరీస్ కూ కలిసొచ్చింది. ఈ సిరీస్ కు నీహారిక చాలా కీలకం అంటున్నాడు దర్శకుడు ప్రణీత్ బ్రహ్మడపల్లి. ‘ఈ సిరీస్ కు సెల్లింగ్ పాయింట్ నీహారిక ఉండడమే. ఈ కేరక్టర్ కు తను పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.’ అని చెప్పాడు. ఇంతకీ ఈ సీరీస్ పేరు ముద్ద పప్పు ఆవకాయ , కేవలం మొదటి ఎపిసోడ్ కే ఏడున్నర లక్షల వ్యూస్ వచ్చాయి, రెండవ సీరీస్ కి ఆరున్నర లక్షల వ్యూస్ వచ్చాయి.
{youtube}v=NS_Hrf7oNZM{/youtube}
