Saturday, May 25, 2024
- Advertisement -

మహేష్‍కి త్రివిక్రమ్‌‍ మధ్య ఏం జరిగింది?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ మంచి స్నేహితులు. ఓ ఇద్దరి కాంబినేషన్‍లో రెండు సినిమాలు వచ్చాయి. మరో సినిమా కూడా చేయడానికి కూడా ప్లాన్ జరుగుతుంది. ఐతే ఈ టాప్ హీరో, ఈ టాప్ దర్శకుడు తమ సినిమాలతో ఈ సమ్మర్‍లో పోటీ పడబోతున్నారు.

మహేష్ సినిమా ముందు నుంచే వేసవికి రాబోతుందని ప్రకటించేసారు. ఏప్రిల్‌ 29న మహేష్ సినిమాని రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమా ‘అ..ఆ’ కూడా సమ్మర్‍లో నే రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం సినిమాని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకేక్కుతుంది. అలాగే త్రివిక్రామ్ తెరకేక్కిస్తున్న ‘అ..ఆ’ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు వారం రోజుల తెడతో రిలీజ్ కానున్నాయి. మహేష్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ సినిమా అయిన వాయిదా వేసుకుంటారు. త్రివిక్రామ్ మాత్రం మహేష్ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకే రిలీజ్ చేస్తున్నాడు. నిజానికి ‘అ..ఆ’ ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఈ సమ్మర్‍కి రిలీజ్ ప్లాన్ చేసారు. నితిన్‍ సరసన సమంత హీరోయిన్‍గా నటిస్తుంది. మరి ఈ సమ్మర్‍లో ఎవరి సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -